హైదరాబాద్ : దర్శకుడిగా ఎన్నో ఘన విజయాలు సొంతం చేసుకున్న కె. రాఘవేంద్రరావు
డిజిటల్ బాట పట్టారు. ఆయన కొత్త యూట్యూబ్ చానల్ ను ప్రారంభించారు. ‘కేఆర్ఆర్
వర్క్స్’ పేరిట చానల్ ను ఏర్పాటు చేశారు. మరో దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి
చేతుల మీదుగా దీన్ని ప్రారంభించారు. ‘రాఘవేంద్రరావు ఎన్నో దశాబ్దాలుగా ఎంతో
మందిని తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు. ఎంత చేసినా ఆయనలో తపన ఇంకా
ఆగలేదు. మరెంతో మందిని వెండి తెరకు పరిచయం చేయాలని ఇప్పుడు ‘కేఆర్ఆర్ వర్క్స్’
చానెల్ ఏర్పాటు చేశారు. దీన్ని నేను ప్రారంభిస్తున్నందుకు నేను ఎంతో సంతోషంగా
ఉన్నా. 80 ఏళ్ల యంగ్ డైరెక్టర్ రాఘవేంద్రరావుకు ఆల్ ది బెస్ట్’ అని రాజమౌళి
చెప్పారు. సామాన్యులను సెలబ్రిటీలను చేయడం కోసం రాఘవేంద్రరావు ఈ చానల్
ప్రారంభించారని యాంకర్ సుమ చెప్పారు. క్రియేటివ్ షార్ట్ ఫిల్మ్ స్ర్కిప్టులు,
యాక్టింగ్ రీల్స్, మ్యూజిక్ ఆల్బమ్స్, వెబ్ సిరీస్ కథలను తమతో పంచుకోవాలని
సూచించారు.