ఉత్తరప్రదేశ్లో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం ఆ రాష్ట్రంలో మూడు అదనపు
నగరాలను పోలీసు కమిషనరేట్ వ్యవస్థగా మార్చింది. మూడో దశలో ఆగ్రా, ఘజియాబాద్,
ప్రయాగ్రాజ్ నగరాల్లో పోలీస్ కమిషనర్ వ్యవస్థను ప్రవేశపెట్టే ప్రతిపాదనకు
శుక్రవారం జరిగిన యూపీ కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపింది. దీంతో కమిషనర్
వ్యవస్థను ఉపయోగిస్తున్న మొత్తం నగరాల సంఖ్య ఏడుకు చేరింది. గతంలో పోలీస్
కమిషనర్ వ్యవస్థ రెండు దశల్లో అమలులోకి వచ్చింది. జనవరి 13, 2020న, లక్నో,
నోయిడాల్లో అమల్లోకి రాగా, మార్చి 26, 2021న కాన్పూర్, వారణాసికి కమిషనరేట్
హోదా లభించింది.