రాష్ట్ర రాజకీయాల్లో రంగా పేరు ఎత్తకుండా రాజకీయాల నడవవు
వంగవీటి రాధాకృష్ణకి రాజకీయ వెన్నుపోటు పొడిచిన పార్టీలకి, వ్యక్తులకి రాబోయే
ఎన్నికల్లో రాధా మార్కు రాజకీయంతో గుండెపోటు తప్పదు
వైసీపీ నాయకులకి చిత్తశుద్ధి ఉంటే రంగా పేరు మీద ఒక పథకం ప్రకటించాలి
స్మృతి వనం ఏర్పాటు చేయాలి
రంగా వర్ధంతులు, జయంతులను ఓటు బ్యాంకు కోసం వాడుకున్న సీఎం జగన్ నేడు ఎందుకు
నివాళులర్పించడం లేదు?
వంగవీటి మోహన్ రంగా 76 వ జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్న జనసేన పార్టీ
విజయవాడ నగర అధ్యక్షులు, రాష్ట్ర అధికార ప్రతినిధి, పశ్చిమ నియోజకవర్గ
ఇన్చార్జి పోతిన వెంకట మహేష్
విజయవాడ : బందర్ రోడ్ లో వంగవీటి రాధా కృష్ణ తో కలిసి రంగా కాంస్య
విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ రంగాని
ప్రభుత్వాలు గుర్తు పెట్టుకోక పోయినా ప్రజలు గుండెల్లో పెట్టుకున్నారని, ఆయన
స్పూర్తి తో సమస్యలపై అనేక మంది పోరాటం చేస్తున్నారని, రంగా తనయుడు రాధాకృష్ణ
కు రాజకీయంగా వెన్నుపోటు పొడిచిన జగన్ కి గుండె పోటు తెప్పించడం ఖాయమని
అన్నారు. నాలుగేళ్లుగా రాధాకృష్ణ రాజకీయ ప్రతీకారం కోసం ఎదురు చూస్తున్నారని,
వంగవీటి మోహనరంగా విగ్రహాలు ఆవిష్కరిస్తూ, సమస్యలు పై రాధా అధ్యయనం చేశారని,
తనను మోసం చేసిన వారందరికి రాధాకృష్ణ రాజకీయ సమాధి కడతారని, రంగాకి నిజమైన
వారసుడు రాధాకృష్ణ అని, రాధాకృష్ణ చెప్పిన మాట ప్రకారం అందరూ కలిసి నడవండని,
వైసిపి లో రాధా ఉన్న సమయంలొ సిఎం జగన్మోహన్ రెడ్డి రంగా జయంతి, వర్దంతి
నిర్వహించారని, మరి ఇప్పుడు అదే జగన్ రంగాకి నివాళి ఎందుకు అర్పించడం లేదని
ప్రశ్నించారు. ఎన్నికల సీజన్ రావడంతో రంగా పేరు చెప్పి నటిస్తు,
జీవిస్తున్నారని, జగన్ కి , వైసీపీ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే రంగా పేరుతో
పధకం గానీ, జిల్లా పేరు కానీ పెట్టించాలని డిమాండ్ చేశారు. రంగా పేరు చెప్పి
ఓట్లు వేయించుకున్న పాలకులు జగన్ ని నిలదీయాలని, సూర్య చంద్రులు ఉన్నంత
కాలం రంగా పేరు ఉంటుందని, రంగా పేరు చెప్పకుండా ఏ రాజకీయ పార్టీలు రాజకీయం
చేయలేవని, రాబోయే రోజుల్లో రంగా ఆశయ సాధన కోసం రాధా రంగా మిత్రమండలి, రాధా
కృష్ణ అభిమానులు బలంగా పని చేయాలని, రాబోయే రోజుల్లో రాధాకృష్ణ ఏ పిలుపు
యిస్తే ఆ పిలుపునకు అనుగుణంగా అందరూ కలసికట్టుగా పనిచేయాలని ఆయన అన్నారు.
39 వ డివిజన్ అధ్యక్షులు ఏలూరు సాయి శరత్ ఆధ్వర్యంలో భవానిపురం కుమ్మరిపాలెం
సెంటర్ వద్ద రంగా గారి చిత్రపటానికి తమ్మిన లీలా కర్ణాకర్ తదితరులతో కలిసి
ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు.
53వ డివిజన్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కోమల విలాస్
సెంటర్ వద్ద రంగా చిత్రపటానికి అడ్డగిరి పుల్లారావు, పోతీన దుర్గారావు పప్పు,
పులి చేరి రమేష్, భక్కి ప్రసన్న, అడ్డాల సాయి, వరబబు, అగ్రహారపు రాజు, బేతాళ
రవి, కోన తరుణ్ తదితరులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి
పేదలకు స్వీట్లు పంపిణీ చేశారు. 34 వ డివిజన్ అధ్యక్షులు ఆకుల రవిశంకర్ గ
ఆధ్వర్యంలో కెధారాశి రావు మూడో లైన్ వద్దా వద్ద రంగా చిత్రపటానికి అల్లం
రమేష్, రుద్రపాటి వెంకటేష్, బాల, సాయి వాయిస్ ఆఫ్ మాల మహానాడు శ్రీను శ్యామ్
మధు తదితరులతో కలిసి ఘనంగా నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి పేదలకు
స్వీట్లు పంపిణీ చేశారు.