nపవన్ కళ్యాణ్ ఆలోచనలకు అనుగుణంగా సేవా కార్యక్రమాలు
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు సంజీవని
జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన మనోహర్
రక్తదానం చేసిన నాదెండ్ల మనోహర్ గుంటూరు : పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల్లో
భాగంగా శనివారం మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మెగా
రక్తదాన శిబిరాన్ని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్
ప్రారంభించి స్వయంగా రక్తదానం చేశారు. గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి చెందిన
దాదాపు 100 మంది వైద్య సిబ్బంది దాతల నుంచి రక్తం స్వీకరించారు. వందల సంఖ్యలో
జనసైనికులు, వీర మహిళలు ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్నారు. వైద్యులు ప్రతి
ఒక్కరి రక్తం నమూనాలను స్వీకరించి, గ్రూపు వివరాలు నిర్ధారించిన తర్వాతే
రక్తాన్ని స్వీకరించారు. మనోహర్ శిబిరాన్ని దగ్గరుండి పర్యవేక్షించారు.
రక్తదాతల వద్దకు వెళ్లి పేరు పేరునా పలకరించి అభినందించారు. రక్తదానం అనంతరం
దాతలకు స్వయంగా సర్టిఫికేట్లను అందజేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్
మాట్లాడుతూ “పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల సందర్భంగా
ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరం నిర్వహించడం ఎంతో సంతోషదాయకంగా ఉంది. పవన్
కళ్యాణ్ ఆలోచనా విధానాలకు అనుగుణంగా ఈ రోజు సేవా కార్యక్రమాలు
నిర్వహిస్తున్నాం. రక్త దానం అనేది ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపుతుంది.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులకు, ప్రమాద ఘటనల్లో గాయపడినవారి ప్రాణాలు
నిలపడానికి సహాయ పడుతుంది. ఈ రక్తదాన శిబిరంలో ఒక జనసైనికుడిలా పాల్గొని
ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమం ద్వారా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
తెలియజేయడం ఆనందంగా ఉంది. రక్తదానం చేయడానికి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన
ప్రతి ఒక్క జన సైనికుడుకీ, వీరమహిళకు అభినందనలు. ఈ రోజు సేకరించిన బ్లడ్
యూనిట్స్ ను గుంటూరు జీజీహెచ్ కు అందిస్తామని తెలియజేశారు. జనసేన పార్టీ
నిర్వహించిన ఈ రక్తదాన శిబిరం ద్వారా సేకరించిన రక్తనిల్వలు నెల రోజుల పాటు
జీజీహెచ్ కు వచ్చే అత్యవసర విభాగం రోగులకు ఉపయోగపడతాయని కార్యక్రమాన్ని
పర్యవేక్షించిన ప్రభుత్వ వైద్యులు హర్షం వ్యక్తం చేశారు.
కేక్ కట్ చేసిన మనోహర్
రక్తదాన శిబిరాన్ని ప్రారంభించే ముందు పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా
పార్టీ శ్రేణులు ఏర్పాటు చేసిన కేకును నాదెండ్ల మనోహర్ కట్ చేశారు. పార్టీ
అధినేతకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు లాంగ్ లివ్
జనసేనాని అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ గుంటూరు జిల్లా
అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, చేనేత వికాస విభాగం ఛైర్మన్ చిల్లపల్లి
శ్రీనివాస్, డాక్టర్స్ సెల్ వైస్ ఛైర్మన్ డాక్టర్ పాకనాటి గౌతమ్ రాజ్, పార్టీ
నాయకులు అమ్మిశెట్టి వాసు, బేతపూడి విజయ్ శేఖర్, డి.వరప్రసాద్, బి.పార్వతి
నాయుడు, కృష్ణా, గుంటూరు జిల్లా నాయకులు పాల్గొన్నారు.