పురుషులతో పోల్చితే స్త్రీలలో అధికంగా ఉంటుంది. రక్తహీనతతో బాధపడేవారు ఈ
పండ్లు తింటే మంచి ఫలితాలను పొందవచ్చు.
దానిమ్మ:
రక్తపరిమాణాన్ని పెంచడంలో దానిమ్మ, సహాయపడుతుంది. దానిమ్మలో ఐరన్, విటమిన్ ఏ,
నీ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇందులో ఉండే ఆస్కారిబ్ యాసిడ్ ఐరన్, కంటెంట్ ను
పెంచుతుంది.
యాపిల్:
యాపిల్ తినడంతో ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇందులో ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇది
రక్తపరిమాణాన్ని పెంచడంలో సహాయపడుతుంది. ప్రతి రోజూ ఒక యాపిల్ తినడంతో మంచి
ఫలితాలు పొందవచ్చు.
అరటి:
అరటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్ కంటెంట్ హిమోగ్లోబిన్
స్థాయిలను పెంచడంలో సహాయపడుతుంది. ఇందులో ఉన్న బీ విటమిన్ ఎర్రరక్తకణాలు
పెంచేందుకు సహాయపడుతుంది.
పీచ్:
పీచ్ పండ్లను తినడంతో శరీరానికి కావాల్సిన విటమిన్ సి, ఐరన్ సులభంగా
అందుతుంది. ఇవి రక్తహీనతను దూరం చేయడంలో సహాయపడతాయి. బరువు తగ్గేందుకు సైతం
ఇవి సహాయపడతాయి.
నారింజ:
రెగ్యులర్ గా నారింజ తినడంతో ఐరన్ లోపం నుంచి బయిటపడవచ్చు. నారింజ తినడంతో
రోగనిరోధకశక్తి మెరుగుపడుతుంది. బరువు తగ్గడానికి, అందమైన చర్మం అందించడంలో
ఇది సహాయపడుతుంది.
బీట్ రూట్:
బీట్ రూట్ లో ఐరన్ కంటెంట్, విటమిన్ సీ, ప్రోటీన్లు, కాల్షియం కంటెంట్
పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారు బీట్ రూట్ రసం తాగడంతో
మంచి ఫలితాలు పొందవచ్చు.
డ్రై ఫ్రూట్స్:
డ్రై ఫ్రూట్స్ తినడంతో శరీరానికి కావాల్సిన శక్తి సులభంగా లభిస్తుంది.
డ్రైఫ్రూట్స్ తినడంతో శరీరానికి కావాల్సిన ఐరన్ అందుతుంది. ప్రతి రోజూ వీటిని
తినడం మంచిది.
కిస్మిస్:
ఇవి తినడంతో రక్తహీనత సమస్య దరి చేరదు. 100 గ్రాముల కిస్మిస్ లో 1.9
మిల్లీగ్రామలు ఐరన్ లభిస్తుంది. కిస్మిస్ తినడంతో రోజులో కావాల్సిన ఐరన్ 10
శాతం అందుతుంది.