హీమోగ్లోబిన్ తయారవుతుంది. హీమోగ్లోబిన్ తయారయ్యే దాన్ని ‘మూలుగ’ అని అంటాము.
ఈ హీమోగ్లోబిన్ అనే ప్రొటీన్ శరీరంలో తక్కువగా తయారవడం ఈ సమస్య ఏర్పడుతుంది.
రక్త హీనత సమస్య ఉన్న వారు తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలేంటో ఇప్పుడు
తెలుసుకుందాం…
1. బీట్ రూట్, రక్తం తగ్గిన వారికి చక్కటి ఆహారం. దీన్ని మనం రోజూ తినే
ఆహారంలో భాగంగా చేసుకోవాలి.ఎందుకంటే రక్తం తక్కువగా ఉన్న వారికి, వీటి జ్యూస్
తాగిస్తే చాలు. ఇలా 7 రోజులు తాగితే హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.
2. మొలకెత్తిన పప్పు ధాన్యాలు, విటమిన్ సి ఎక్కువగా వుండే నిమ్మ, ఉసిరి, జామ
లాంటివి కలిపి తీసుకోవడం ద్వారా రక్త హీనత రాకుండా ఉంటుంది.
3. బాదం, జీడి పప్పు, ఎండు ఖర్జురాలు వీటిని కూడా మనం రోజు తినే ఆహారంలో
భాగంగా చేసుకోవాలి.
4. అరటి పండ్లు, ద్రాక్ష, స్ట్రాబెర్రీ, కిస్మిస్, ఉల్లి, క్యారెట్, ముల్లంగి,
టొమోటోలు తీసుకోవాలి.
5. గ్లాసు నీటిలో రెండు టీ స్పూన్ల తేనే వేసుకొని తాగితే చాలా మంచిది.
6. అంజీరా పండ్లను తినడం వల్ల రక్తహీనత సమస్య తగ్గుతుంది.