కర్ణాటకలోని బెంగళూరులో ఏరో ఇండియా-2023 ప్రదర్శన ఘనంగా ప్రారంభమైంది.
బెంగళూరులోని యలహంకలోని వైమానిక కేంద్రంలో ఐదు రోజులపాటు ఈ ప్రదర్శన
కొనసాగనుంది. ఇందులో భాగంగా భారత్‌లో తయారైన తేలికపాటి హెలికాప్టర్ ప్రచండ్
ఆహుతులను ఆకట్టుకున్నది. హెలికాప్టర్‌తో పైలట్లు చేసిన విన్యాసాలు అందరినీ
అబ్బురపరిచాయి. ఈ ప్రదర్శనలో భారత్‌లో తయారైన యుద్ధవిమానాలు, తేలికపాటి
హెలికాప్టర్లను ప్రదర్శిస్తున్నారు. మొత్తం 109 దేశాలకు చెందిన ప్రతినిధులు ఈ
షోకు హాజరయ్యారు.
ఏరో ఇండియా ప్రదర్శనను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగా
నరేంద్ర మోడీ మాట్లాడుతూ రక్షణరంగంలో భారత్ బలోపేతమైందన్నారు. తక్కువ
ఖర్చుతోనే రక్షణ పరికరాలను తయారుచేస్తున్నామని వెల్లడించారు. రక్షణరంగ
సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి చేరుకున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్
ద్వారా ఇక్కడే విమానాలు తయారుచేసుకుంటున్నామని పేర్కొన్నారు. రక్షణరంగంలో
పెట్టుబడులు పెట్టాలని ప్రైవేటు సంస్థలను కోరారు. విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ
సామగ్రిని ఆరు రెట్లు పెంచామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్నో
కొత్తపుంతలు తొక్కామని చెప్పారు. పరిశ్రమలు ఇచ్చే అనుమతులను సరళతరం చేశామని
వెల్లడించారు. కేంద్ర బడ్జెట్లో వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపేటీ
వేశామన్నారు. భారత్ బలోపేతమైందన్నారు. తక్కువ ఖర్చుతోనే రక్షణ పరికరాలను
తయారుచేస్తున్నామని వెల్లడించారు. రక్షణరంగ సామగ్రిని ఎగుమతి చేసే స్థాయికి
చేరుకున్నామని తెలిపారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా ఇక్కడే విమానాలు
తయారుచేసుకుంటున్నామని పేర్కొన్నారు. రక్షణరంగంలో పెట్టుబడులు పెట్టాలని
ప్రైవేటు సంస్థలను కోరారు. విదేశాలకు ఎగుమతి చేసే రక్షణ సామగ్రిని ఆరు రెట్లు
పెంచామన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఎన్నో కొత్తపుంతలు తొక్కామని
చెప్పారు. పరిశ్రమలు ఇచ్చే అనుమతులను సరళతరం చేశామని వెల్లడించారు. కేంద్ర
బడ్జెట్లో వస్తువుల తయారీ పరిశ్రమలకు పెద్దపేటీ వేశామన్నారు.