రజకులలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడానికి వారిని జగన్ ప్రోత్సహిస్తున్నారు
18 లక్షల రజక కుటుంబాలకు డిబిటి,నాన్ డిబిటి ల ద్వారా 17 వేల కోట్ల రూపాయల లబ్ది
బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీలను ప్రోత్సహించేందుకు జగన్ కట్టుబడి ఉన్నారు
రజకులు తమ తమ నియోజకవర్గాలలో వైయస్సార్ సిపి ప్రభుత్వం వల్ల జరిగిన లబ్దిని సమావేశాల ద్వారా వారి సంఘీయులకు తెలియచేయాలి
రజకుల ఆత్మీయ సమావేశంలో వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి సజ్జల రామకష్ణారెడ్డి
గుంటూరు : బిసిలు అగ్రవర్ణాలతో పోటీ పడే విధంగా నాయకత్వలక్షణాలను పెంపొందించుకోవాలని వైయస్సార్ సిపి రాష్ర్ట ప్రధాన కార్యదర్శి,ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకష్ణారెడ్డి అన్నారు. వైయస్ జగన్ అమలు చేస్తున్న పధకాల వల్ల అత్యధికంగా లబ్ది పొందుతున్నది బిసి,ఎస్సి,ఎస్టి,మైనారిటీ వర్గాలేనని తెలియచేశారు.తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన రజకుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమానికి రజక కార్పోరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య అధ్యక్షత వహించారు. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ రాష్ర్టంలో వివిధ పధకాలకు సంబందించి చూసినట్లయితే గత నాలుగున్నరేళ్ల కాలంలో 18 లక్షల కుటుంబాలకు డిబీటి ద్వారా అంటే నేరుగా ఆయా కుటుంబాల అకౌంట్లలో 5,600 కోట్ల రూపాయలు వేయడం జరిగింది.అదే విధంగా నాన్ డిబిటి లను కూడా కలుపుకుంటే 17 వేల కోట్ల రూపాయలు రజక కుటుంబాలకు అందచేయడం జరిగిందన్నారు.ఈ విషయాన్ని ప్రతి కార్యకర్త సగర్వంగా చెప్పుకోవచ్చని వివరించారు. ఈ విధంగా వైయస్ జగన్ ప్రభుత్వం చేసిన లబ్దిని ఆయా రజక సంఘాలు రాష్ర్టంలోని ప్రతి నియోజకవర్గంలో సమావేశాలు ఏర్పాటుచేయడం ద్వారా వారి కుటుంబంలోని ప్రతి ఒక్కరికి తెలియచేయాలన్నారు. తద్వారా జగన్ తిరిగి ముఖ్యమంత్రిగా గెలిపించుకోవడం ద్వారా రజకులు మరింత అభివధ్ది పధంలో నడిచేందుకు వీలు కలుగుతుందనే విషయం గుర్తించాలన్నారు. దేశంలో బిసిలు ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ర్టాలలో కూడా 50 శాతం ఎస్సి, ఎస్టి, బిసి, మైనారిటీలకు నామినేటెడ్ పదవులు ఇవ్వలేదనే వాస్తవాన్ని గమనించాలన్నారు. గతంలో రాజకీయపార్టీలు ఆయా వర్గాలను కేవలం ఎన్నికల సమయంలో ఓటు బ్యాంకులుగానే చూశాయన్నారు. జగన్ బిసిలను ఆర్దికంగా, సామాజికంగా, రాజకీయంగా, విద్య, పారిశ్రామిక పరంగా అగ్రవర్ణాలతో పోటీ పడేవిధంగా చేయాలనే తపన జగన్ గారిదన్నారు. గతంలో రజకులకు చంద్రబాబు కేవలం ఇస్ర్టీ పెట్టెలు ఇచ్చి ఆదరణతో ఆదరించానని మభ్యపుచ్చారన్నారు. బిసిల సమస్యల పరిష్కారం కోసం వెళ్తే చంద్రబాబు అవమానించి నేడు జయహో బిసి అంటూ సభలు పెట్టి ప్రగల్బాలు పలుకుతున్నారని విమర్శించారు. బిసిలు ముమ్మాటికి చంద్రబాబును నమ్మేస్దితిలో లేరని అన్నారు. వైయస్ రాజశేఖరరెడ్డి గాని, నేడు జగన్ కాని రజకులు నేటి సమాజానికి అనుగుణంగా అభివధ్ది చెందాలనే దిశగా పధకాలు అమలు చేస్తున్నారని వివరించారు. రజక కార్పోరేషన్ ఛైర్మన్ మీసాల రంగయ్య మాట్లాడుతూ రాష్ర్టంలో రజకుల అభివృద్దికి జగన్ చేస్తున్న కృషిని ప్రతి నియోజకవర్గానికి తీసుకువెళ్తానని తెలియచేశారు. పలు రజక సంఘాల ప్రతినిధులు మాట్లాడుతూ రజకుల సమస్యలను సజ్జల రామకృష్ణారెడ్డి దృష్టికి తీసుకువచ్చారు.