అగ్ర నటులైన అమితాబ్ బచ్చన్, రజనీ కాంత్ లతో కలిసి తెరని పంచుకునే ఒక అరుదైన
అవకాశం సొంతం చేసుకున్నారు శర్వానంద్. ‘జైభీమ్’ ఫేమ్ టి.జె. జ్ఞానవేల్
దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా ఓ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో అమితాబ్
బచ్చన్ ఓ కీలక పాత్రని పోషిస్తున్నారు. ఈ సినిమాలో యువ కథానాయకుడు
పోషించాల్సిన ఓ కీలక పాత్ర ఉంటుందట. ఆ పాత్ర కోసం పలువురు పేర్లు ప్రచారంలోకి
వచ్చినా చివరికి ఆ అవకాశం శర్వానంద్ కి దక్కింది. రజనీకాంత్ కి ఇది 170వ
చిత్రం కాగా, ఆయన అమితాబ్ తో కలిసి దాదాపు 32 ఏళ్ల తర్వాత నటిస్తున్న చిత్రం
కూడా ఇదే కావడం విశేషం.