‘హాయ్ నాన్న’ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు కథానాయకుడు నాని. మరోవైపు ఆయన
కొత్త సినిమాల గురించి జోరుగా చర్చ సాగుతోంది. తమిళ చిత్రసీమ నుంచి
వినిపిస్తున్న కబుర్లే అందుకు ప్రధాన కారణం. రజనీకాంత్ కథానాయకుడిగా ‘జై భీమ్’
దర్శకుడు జ్ఞానవేల్ ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులోని ఓ కీలకమైన
పాత్ర కోసం నానిని సంప్రదించినట్టున తమిళ సినీ వర్గాలు స్పష్టం చేశాయి. ఈ
సినిమాలో అమితాబ్ బచ్చన్ కూడా నటించనున్నట్టు తెలుస్తోంది. మరి నాని
నిర్ణయమేమిటనేది తెలియాల్సి ఉంది. దీనితో పాటు సూర్య, దుల్కర్ సల్మాన్ నాని
కలయికలోనూ ఓ సినిమా కోసం సన్నాహాలు మొదలైనట్టు కూడా తమిళ సినీ వర్గాలలో
వినికిడి.