తిరుమల : రథసప్తమిని పురస్కరించుకొని తిరుమల శ్రీవారి వాహన సేవలు
వీక్షించేందుకు విచ్చేసిన లక్షలాది మంది భక్తులకు శ్రీవారి సేవకులు ఎంతో
క్రమశిక్షణతో విశేషంగా సేవలందించారు. దాదాపు 1800 మంది శ్రీవారి సేవకులు
అన్నప్రసాదం, ఆరోగ్యశాఖ, విజిలెన్స్ విభాగాలకు సంబంధించి మాడ వీధుల్లోని
వివిధ ప్రాంతాలలో భక్తులకు సేవలందించారు. శనివారం ఉదయం 4 గంటల నుండి నాలుగు
మాడ వీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉన్న భక్తులకు ఉదయం కాఫీ, పాలు, తాగునీరు,
అల్పాహారం, మజ్జిగ, అన్నప్రసాదాలను భక్తిశ్రద్ధలతో పంపిణీ చేశారు. భక్తులు
గ్యాలరీలలోనికి వచ్చేందుకు మాడ వీధులలో ప్రవేశ, నిష్క్రమణ ద్వారాల వద్ద,
గ్యాలరీలలోని ముఖ్యమైన ప్రాంతాలలో భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు టిటిడి
అధికారులకు, సిబ్బందికి సహకరించారు. తూర్పు మాడ వీధిలో 350 మంది, పడమర మాడ
వీధిలో 360 మంది, దక్షిణ మాడ వీధిలో 280 మంది, ఉత్తర మాడ వీధిలో 500 మంది
శ్రీవారి సేవకులు సేవలందించారు. 300 మంది సేవకులు వాహనసేవల్లో భద్రతా
సిబ్బందికి సహకారం అందించారు. అదేవిధంగా, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ
అన్నప్రసాద భవనం, అక్షయ వంటశాల, పిఏసి-2, పిఎలో శ్రీవారిసేవకులు
ఆహారపొట్లాలు తయారుచేశారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ కూడా టిటిడి
విజిలెన్స్, పోలీస్ సిబ్బంది సహకారంతో తిరుమలలోని అన్ని ప్రాంతాల్లో భద్రతా
ఏర్పాట్లలో విధులు నిర్వహించారు. అన్ని విభాగాల్లో కలిపి ఆంధ్రప్రదేశ్,
తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాల నుండి
విచ్చేసిన దాదాపు 3000 మంది శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించారు.
శ్రీవారి సేవకులు అందించిన సేవల పట్ల భక్తులు సంతోషం వ్యక్తం చేసి
అభినందించారు.