నాటో సభ్య దేశమైన పోలాండ్పై రష్యా మిసైల్ దాడులు జరిపింది. ఈ దాడిలో ఇద్దరు
మృతి చెందారు. ఈ ఘటనతో పోలాండ్ ఆర్మీ అప్రమత్తమైంది. ఇది రష్యా పని కాదని
అమెరికా అధ్యక్షుడు బైడెన్ అన్నాడు. దీనిపై పూర్తి స్థాయి విచారణ చేపడతామని
వెల్లడించారు. రష్యా భూభాగం నుంచి ఈ మిసైల్ రాలేదని తమ ప్రాథమిక విచారణలో
తేలిందని చెప్పారు. పోలాండ్ మీడియా చేస్తున్న ప్రచారంలో వాస్తవమెంతో
తెలుసుకోవాలని అన్నారు. అటు రష్యా ఉక్రెయిన్ యుద్ధం మాత్రం ఎప్పటిలాగే
ఉద్రిక్తంగా కొనసాగుతోంది. రష్యా ఇటీవలే ఉక్రెయిన్లోని పలు ప్రాంతాలపై
క్షిపణి దాడులు చేసింది. కీవ్, ఖార్కివ్, లీవ్, పొల్టెవాపై రష్యన్ మిజైల్స్
దూసుకొచ్చాయి. ఈ క్రమంలోనే ఉక్రెయిన్-పోలాండ్ సరిహద్దు ప్రాంతంలో ఓ మిసైల్
కూలి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. పోలాండ్లోని ప్రొజెవెడో గ్రామంపై ఈ
క్షిపణి పడినట్టు అధికారులు తెలిపారు. ఈ ఘటనతో అప్రమత్తమైన పోలాండ్ ప్రభుత్వం
రాత్రికి రాత్రే డిఫెన్స్ కౌన్సిల్ ఆత్యయిక సమావేశం నిర్వహించింది. రష్యా
రక్షణ శాఖ మాత్రం పోలాండ్ను టార్గెట్గా చేసుకోలేదని, ఈ దాడి చేసింది తాము
కాదని చెబుతోంది.