చెదిరింది. జాబిల్లిపై పరిశోధనల కోసం రష్యా ప్రతిష్ఠాత్మకంగా ప్రయోగించిన
లూనా-25 ప్రయోగం విఫలమైంది. సాంకేతిక లోపం కారణంగా లూనా-25 ల్యాండర్
కుప్పకూలింది. జాబిల్లి సమీపంలోకి వెళ్లిన ల్యాండర్, అనియంత్రిత కక్ష్యలో
పరిభ్రమించి, అనంతరం చంద్రుడి ఉపరితలాల్లి ఢీకొట్టి కూలిపోయిందని రష్యా
అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్కాస్మోస్ అధికారికంగా ధ్రువీకరించింది.
‘ప్రి-ల్యాండింగ్ కక్ష్యలోకి ప్రవేశపెట్టే విన్యాసం సందర్భంగా ఆటోమేటిక్
స్టేషన్లో అసాధారణ పరిస్థితి ఏర్పడింది. నియంత్రణలోకి తీసుకొచ్చేందుకు చేసిన
ప్రయత్నాలు విఫలమయ్యాయి. వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోవడంతో క్రాష్ ల్యాండ్
అయి ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొంది’ అని రోస్కాస్మోస్
టెలిగ్రామ్‌లో పోస్టు చేసింది.
దక్షిణ భాగంపై ల్యాండింగ్ అసాధ్యమా? : 47 ఏండ్ల అనంతరం రష్యా చేపట్టిన
లూనా-25 ప్రయోగాన్ని ఆగస్టు 10న వోస్తోచ్ని కాస్మోడ్రోమ్ నుంచి ప్రయోగించారు.
1,750 కిలోలు మాత్రమే బరువు ఉండే ఇది అతి తక్కువ సమయంలోనే చంద్రుడి ఉపరితలంపై
కాలు మోపేలా డిజైన్ చేశారు. అధిక ఇంధన సామర్థ్యం కారణంగా సుమారు 11
రోజుల్లోనే జాబిల్లిని చేరుకునేలా ప్లాన్ చేశారు. ఆగస్టు 21న చంద్రుడి దక్షిణ
ధ్రువానికి సమీపంలో దీన్ని ల్యాండ్ చేసేలా రష్యా ప్రణాళికలు రచించింది. అయితే
సాంకేతిక లోపం కారణంగా అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగానే క్రాష్ ల్యాండ్
అవడంతో ప్రయోగం విఫలమైంది. సోవియట్ యూనియన్ ఆధ్వర్యంలో 1976లో రష్యా
చంద్రుడి ఉపరితలంపై ల్యాండర్‌ను విజయవంతంగా ల్యాండ్ చేసింది.