మాస్కో : రష్యా రేడియో కేంద్రాలు హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ క్రమంలో
దేశాధ్యక్షుడు పుతిన్ పేరిట ఓ నకిలీ సందేశం ప్రసారమైంది. క్రెమ్లిన్ ఈ
విషయాన్ని వెల్లడించింది. ఏడాదిన్నరకు పైగా సాగుతోన్న సైనిక చర్య క్రమంలో భారీ
దాడులకు గురైన ఉక్రెయిన్ పశ్చిమ దేశాల ఆయుధ సాయంతో రష్యా పై ఎదురుదాడులకు
సిద్ధమవుతున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కొంత కాలంగా డ్రోన్ దాడులతోపాటు
రష్యాలోని బెల్గొరాడ్ ప్రాంతంలో చొరబాటు యత్నాలు మాస్కోను
కలవరపరుస్తున్నాయి. ఈ పరిణామాల నడుమ తాజాగా రష్యా రేడియో స్టేషన్లు
హ్యాకింగ్ ) బారిన పడ్డాయి. ఈ క్రమంలోనే దేశాధ్యక్షుడు పుతిన్ పేరిట నకిలీ
సందేశం ప్రసారమైంది. ఉక్రెయిన్ సరిహద్దులోని రష్యా ప్రాంతాల్లో కీవ్ బలగాలు
ఆక్రమణకు దిగాయని, ఈ క్రమంలోనే అత్యవసర చర్యలు తీసుకుంటున్నట్లు ఆ సందేశంలో
ఉంది. క్రెమ్లిన్ ఇదే విషయాన్ని వెల్లడిస్తూ రేడియో కేంద్రాలను ఎవరో హ్యాక్
చేసినట్లు తెలిపింది.