నెల్లూరు : నారా లోకేష్‌కు ఏమాత్రం పరిపక్వత లేదని మాజీ మంత్రి అనిల్‌కుమార్
యాదవ్ మండిపడ్డారు. లోకేష్ చేసిన ఆరోపణలపై ఆధారాలతో సహా మీడియా ముందుకు
వచ్చిన అనిల్.. రాజకీయంగా ఎదుర్కోలేక టీడీపీ అసత్య ఆరోపణలు చేస్తోందని
దుయ్యబట్టారు. భూములు కబ్జా అంటూ లోకేష్ రాజకీయ విమర్శలు చేస్తున్నారు. తనకు
సంబంధంలేని భూములు అంటగడుతున్నారని ధ్వజమెత్తారు. ‘‘లోకేష్‌కి గల్లీ లీడర్‌కు
ఉండే స్థాయి కూడా లేదు.. పసలేని, ఆధారాలు లేని ఆరోపణలు లోకేష్ చేశాడు..
ప్రమాణానికి నేను సిద్దంగా ఉన్నాను.. లోకేష్ స్పందించాలి.. లోకేష్ చేసిన
ఆరోపణల ద్వారా నా చిత్తశుద్ధిని నిరూపించుకునే అవకాశం వచ్చింది. బృందావనం,
పొగతోటలో నాలుగు ఎకరాలు ఉన్నట్లు లోకేష్ ఆరోపిస్తున్నారు.. నిజంగా అదీ
నిజమైతే.. లోకేష్ తీసుకోవచ్చు.. ఇస్కాన్ సిటీలో 87 ఎకరాలు ఉన్నట్లు
ఆరోపించాడు.. అందులో నాకు ఉండేది కేవలం 3.9 ఏకరాలు మాత్రమే’’ అని అనిల్
స్పష్టం చేశారు.