రాష్ట్ర భవిష్యత్తుకు యువత ఆలోచించాలి * యువత ఉద్యోగాల కల్పనకు రూ.10లక్షల
పెట్టుబడి సాయం * జనసేన అధినేత పవన్‌కల్యాణ్ * కాకినాడ రూరల్ నియోజకవర్గ
ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తలతో పవన్ భేటీ * కోనసీమ జిల్లాలో పవన్
వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు
కాకినాడ : రాజకీయాలు మాకొద్దనే ఆలోచన సమాజానికి చేటని జనసేన అధినేత
పవన్‌కల్యాణ్ వ్యాఖ్యానించారు. కుళ్లు రాజకీయాలు ప్రజలు
జీర్ణించుకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడ రూరల్ నియోజకవర్గ
ప్రముఖులు, మేధావులు, పారిశ్రామికవేత్తలతో పవన్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ వైసీపీ వంటి పార్టీల వల్లే రాజకీయాలపై వ్యతిరేకత పెరుగుతోందని,
బాధ్యతలేని పాలకుల వల్ల వ్యవస్థ గాడి తప్పుతోందని పవన్‌కల్యాణ్ దుయ్యబట్టారు.
యువత ఆలోచించాలి : రాష్ట్ర భవిష్యత్తుకు యువత ఆలోచించాలి. సామాజిక న్యాయం,
కులాల ఆధిపత్య ధోరణికి వ్యతిరేకంగా రాజకీయ మార్పునకు దశాబ్ధకాలంగా ప్రజల మధ్యన
ఉంటూ ప్రజా సమస్యలపై పోరాడుతున్నా. వైసీపీ ప్రభుత్వం లో అన్ని వర్గాల ప్రజలు
ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో జనసేనకు అవకాశం కల్పిస్తే ప్రజలకు
మేలు జరిగేలా పాలన అందిస్తా. ఆడబిడ్డల రక్షణకు, భద్రతకు పెద్దపీట వేస్తా. యువత
ఉద్యోగాల కల్పనకు రూ.10లక్షల పెట్టుబడి సాయం ఇచ్చి వేలాది ఉద్యోగావకాశాలు
కల్పిస్తానన్నారు.
ఏటిమొగకు పవన్ : జగన్నాథపురం నుంచి పవన్ బోటులో ఏటిమొగకు వెళ్లారు. అక్కడ
మత్స్యకారులతో ఆయన భేటీ అయ్యారు. మత్స్యకారుల స్థితిగతులను, వారి సమస్యలను
సమగ్రంగా పరిశీలించారు. ముఖాముఖి మాట్లాడి సమస్యల పరిష్కారానికి భవిష్యత్తులో
ఎలాంటి చేపట్టాలో చర్చించారు.
కోనసీమ జిల్లాలో పవన్ వారాహి యాత్ర షెడ్యూల్ ఖరారు : కోనసీమ జిల్లాలో జనసేన
అధినేత పవన్ కళ్యాణ్ “వారాహి” యాత్ర షెడ్యూల్ ఖరారైంది. 20న సాయంత్రం కాకినాడ
నుంచి ముమ్మిడివరంలో పర్యటించనున్నారు. 21న ముమ్మిడివరంలో ఉదయం జనవాణి,
సాయంత్రం సభ ఏర్పాటు చేయనున్నారు. అలాగే 22న అమలాపురంలో జనవాణి కార్యక్యరమం
ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా 23న సాయంత్రం అమలాపురంలో భారీ బహిరంగ సభను
ఏర్పాటు చేయనున్నారు. 24న పి.గన్నవరం, రాజోలులో ఆయన పర్యటించనున్నారు. 25న
రాజోలు మలికీపురంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నారు.