సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్
గుంటూరు : జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ అవగాహన లేమితో మాట్లాడుతున్నారని
సీనియర్ జర్నలిస్టు దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే
చాలా కష్టపడాలని, దాంతో పాటు పూర్తి అవగాహన ఉండాలని, చాలా విషయ పరిజ్ఞానం
ఉండాలన్నారు. ప్రజల్ని నమ్మించగలను అనే ఆత్మవిశ్వాసం ఉండాలని, అదే సమయంలో అతి
విశ్వాసం అనేది ఉండకూడదన్నారు. అయితే పవన్ కళ్యాణ్‌లో ఆత్మ విశ్వాసం లేదు,
అతి విశ్వాసం కూడా లేదన్నారు. కానీ ఆత్మనున్యతా భావంతో ఉన్నట్లే పవన్
కళ్యాణ్ ప్రసంగాల్ని బట్టి అర్ధమవుతుందన్నారు.