జనసేన అధినేత పవన్ కల్యాణ్
రణస్థలం : ఒంటరిగా ఉండి గెలిచే పరిస్థితి ఉంటే ఎవరితోనూ పొత్తు పెట్టుకోమని
జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కానీ, ఆ భరోసా జన సైనికులు ఇస్తారా? అని
ప్రశ్నించారు. నియంతను కలిసి కట్టుగా ఎదుర్కోవాలన్నారు. పొత్తులపై జనసేన
అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చారు. తెదేపాతో జనసేన పొత్తు
పెట్టుకుంటుందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన స్పందించారు.
ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైనప్పుడు పొత్తులు, సీట్ల సర్దుబాటు
గురించి చర్చించలేదని స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జనసేన
ఆధ్వర్యంలో నిర్వహించిన ‘యువశక్తి’ సభలో పవన్ మాట్లాడుతూ జనసేన వ్యూహంపై
పార్టీ శ్రేణులకు స్పష్టత ఇచ్చారు.
‘‘ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఎందుకు అన్నానంటే 53 నియోజకవర్గాల్లో
వైసీపీ సాంకేతికంగానే గెలిచింది. ఇటీవల చంద్రబాబుతో సమావేశమైతే కొందరు
పిచ్చికూతలు కూస్తున్నారు. బేరాలు కుదిరాయని పిచ్చి వాగుడు వాగుతున్నారు. నేను
అలాంటిని వ్యక్తిని కాదు. రూ.25కోట్లు ట్యాక్స్ కట్టే వ్యక్తిని. చంద్రబాబు,
పవన్ రెండున్నర గంటలు ఏం మాట్లాడారని గొంతు చించుకుంటున్నారు. సంబరాల రాంబాబు
గురించి 22 నిమిషాలు, పనికిమాలిన ఐటీ మంత్రి రాష్ట్రాన్ని 15వ స్థానంలోకి
నెట్టేశాడేంటని 18 నిమిషాలు. లాం అండ్ ఆర్డర్ ఎందుకు చితికిపోయింది, ఏం
చేయాలి అని 38 నిమిషాలు మాట్లాడుకున్నాం. మాట్లాడే కొద్దీ కేసులు వస్తున్నాయి.