రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేడెక్కాయి. ఆయా పార్టీలు ఎవరి వ్యూహాలు
వారు అమలు చేస్తున్నారు. 2019 వ్యూహాలకు భిన్నంగా వచ్చే ఎన్నికలు ఉండనున్నాయి.
2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి టీడీపీ తెలంగాణలో పోటీ చేసింది. తెలంగాణలో
తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే మరలా తెలంగాణ, ఏపీని కలిపేస్తారని
సీఎం కేసీఆర్ సెంటిమెంటును మరోసారి రగిలించి సక్సెస్ అయ్యారు. అయితే ఈ సారి ఆ
అవకాశం లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. టీఆర్ఎస్ ప్రస్తుతం బీఆర్ఎస్
పార్టీగా మారింది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో పోటీ చేసేందుకు కేసీఆర్
వ్యూహాలు అమలు చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు, కర్ణాటక,
మహారాష్ట్రలో కనీసం 6 శాతం ఓట్లు వస్తే బీఆర్ఎస్ కు జాతీయ పార్టీ హోదా
దక్కుతుంది. ఆ ఉద్దేశంతోనే ముఖ్యంగా ఏపీలో కనీసం 6 శాతం ఓట్లు సాధించేందుకు
ప్రణాళికలు రచిస్తున్నారు. ఇక తెలంగాణ సెంటిమెంటును జనం నమ్మే పరిస్థితుల్లో
లేరు కాబట్టి, తెలంగాణ తరహా అభివృద్ధిని అన్ని రాష్ట్రాల్లో చేసి చూపిస్తామని
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారం ప్రారంభించారు. ఇక ఏపీ జనాలను తిట్టినా
పెద్దగా ప్రయోజనం ఉండదు. అలా చేస్తే ఏపీలో వచ్చే ఓట్లు కూడా పోతాయని కేసీఆర్
కు తెలియదా. అందుకే ఈసారి ఆయన జాతీయ వ్యూహాలను అమలు చేసే అవకాశం ఉన్నట్లు
తెలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకూ ఆసక్తిగా మారుతున్నాయి. వాస్తవానికి ఏపీ రాజకీయం ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య విభేదాలు తారస్థాయికి చేరుకోవడంతో ఎత్తులు పైఎత్తులతో రాజకీయాన్ని ఆసక్తిగా మారుస్తున్నాయిఅలాగే ఇదేం కర్మ రాష్ట్రానికి అంటూ ప్రతిపక్ష టీడీపీ ప్రజలకు చేరువవుతోంది. దీంతో రెండు పార్టీల మధ్య రగడ మొదలైంది. రాజకీయ పార్టీలు కార్యక్రమాలు చేపట్టడం కామన్. తమ కార్యాచరణను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పలు రకాల కార్యక్రమాలు చేపట్టడం మామూలే. అయితే ఇక్కడ పరిస్థితి వేరుగా ఉంటోంది. ప్రతిపక్ష నేత ఎక్కడైనా సభ పెడ్తుంటే అక్కడ బ్యానర్లు, ఫ్లెక్సీలు కట్టడం సాధారణంగా జరిగేదే.

అలాగే బొబ్బిలిలో చంద్రబాబు పర్యటన కూడా ఉద్రిక్తతలకు కారణమైంది. ఇప్పుడే
ఇలాంటి పరిస్థితి నెలకొని ఉంటే మున్ముందు ఇంకెన్ని ఇలాంటి సంఘటనలు చూడాల్సి
వస్తుందోనని జనం బెంబేలెత్తిపోతున్నారు. పులివెందుల సంస్కృతిని రాష్ట్రమంతటా
విస్తరిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శిస్తున్నారు. ప్రశాంతంగా
ఉన్న రాష్ట్రంలో చిచ్చు పెడుతున్నారని మండి పడుతున్నారు. ప్రశాంతంగా ఉండే
కుప్పంలో కూడా తనను అడ్డుకునేందుకు ప్రయత్నించి గొడవలు పెట్టిందని ఆయన
దుయ్యబడుతున్నారు. అయితే చంద్రబాబే ఇలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నారని వైసీపీ
నేతలు ఆరోపిస్తున్నారు.