సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల పట్టాల
పంపిణీ
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో అందించనున్న ముఖ్యమంత్రి వైఎస్
జగన్మోహన్రెడ్డి
అమరావతి : సీఆర్డీఏ పరిధిలో 1,402 ఎకరాల్లో 50,793 మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల
పట్టాల పంపిణీ చేయడంతో పాటు సీఆర్డీఏ ప్రాంతంలో రూ. 443.71 కోట్లతో నిర్మించిన
5,024 టిడ్కో ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించే కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా
తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శుక్రవారం
లాంఛనంగా ప్రారంభించనున్నారు. పెత్తందార్లు కేవలం తమ వారే బాగుపడాలనే కుట్రతో
న్యాయపరమైన చిక్కులు సృష్టించి అడ్డుకోవాలనుకున్నా.. అమరావతిలో పేదలకు స్థానం
లేదని చీత్కరించినా.. పేదలకు ఇళ్లిస్తే సామాజిక సమతౌల్యత దెబ్బతింటుందని
వక్రభాష్యాలు చెప్పినా.. సమాధులని అవహేళన చేసినా.. పేదలకు ఇళ్లివ్వకుండా అనేక
అవరోధాలు సృష్టించినా.. పేద అక్కచెల్లెమ్మలకు మంచి జరగాలని.. వారి ముఖాల్లో
సంతోషం చూడాలని, వారికి ఒక గూడు ఏర్పడాలని.. వారి భవిష్యత్తు బాగుండాలని..
కృత నిశ్చయంతో అడ్డంకులన్నీ అధిగమించి.. పేదల పక్షాన నిలబడి నేడు 50,793 మంది
అక్క చెల్లెమ్మలకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తోంది.
టిడ్కో లబ్ధిదారులకు అండగా : రాష్ట్రవ్యాప్తంగా 1,43,600 మంది లబ్ధిదారులకు
300 చ.అ.ల టిడ్కో ఇళ్లు కేవలం 1 రూపాయికే అన్ని హక్కులతో అందజేత.. తద్వారా
రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మలకు రూ.9,406 కోట్ల మేర లబ్ధి.. గత
ప్రభుత్వంలో ఇదే ఇంటికి అసలు, వడ్డీలతో కలిపి ఒక్కొక్కరు రూ. 7.20 లక్షలు
చెల్లించాల్సిన దుస్థితి.. లబ్ధిదారులు చెల్లించాల్సిన ముందస్తు వాటా సొమ్ములో
50 శాతాన్ని రాయితీగా అందిస్తూ, 365 చ.అ.ల టిడ్కో ఇళ్ల లబ్ధిదారులు 44,304
మందికి ఒక్కొక్కరికి రూ.25 వేల చొప్పున, 430 చ.అ.ల 74,312 టిడ్కో ఇళ్ల
లబ్ధిదారులకు రూ. 50 వేల చొప్పున రాష్ట్రవ్యాప్తంగా వారు చెల్లించాల్సిన రూ.
482 కోట్ల భారాన్ని కూడా వైఎస్ జగన్ ప్రభుత్వం భరిస్తుంది.
టిడ్కో ఇళ్లకు ఉచితంగా రిజిస్ట్రేషన్లు : తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ. 60
వేల లబ్ధి కలగనుంది. రాష్ట్రవ్యాప్తంగా 2.62 లక్షల మంది టిడ్కో ఇళ్ల
లబ్ధిదారులకు సబ్సిడీ రూపంలో రూ. 14,514 కోట్లు, ఉచిత రిజిస్ట్రేషన్ల రూపంలో
రూ. 1200 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 3,000 కోట్లు కలిపి మొత్తంగా రూ.
18,714 కోట్ల లబ్ధి జగనన్న ప్రభుత్వం అందిస్తుంది. గత ప్రభుత్వం ఈ టిడ్కో
ఇళ్లలో మంచినీటి సదుపాయాలు, రోడ్లు, విద్యుత్, డ్రైనేజీ లాంటి మౌలిక వసతులను
నిర్లక్ష్యం చేస్తే, అన్ని మౌలిక సదుపాయాలతో ఏపీ ప్రభుత్వం ఇళ్లను అందిస్తోంది.
పేద అక్కచెల్లెమ్మలకు తోడుగా : “నవరత్నాలు-పేదలందరికీ ఇళ్ల” ద్వారా సీఆర్డీఏ
పరిధిలో అన్ని మౌలిక సదుపాయాలతో మొత్తం 25 లేఅవుట్లు. 23,762 మంది గుంటూరు
జిల్లా అక్కచెల్లెమ్మలకు 11 లేఅవుట్లు. 27,031 మంది ఎన్టీఆర్ జిల్లా
అక్కచెల్లెమ్మలకు 14 లేఅవుట్లు. 80,000 హద్దు రాళ్ల ఏర్పాటు. 95.16 కి.మీలలో
గ్రావెల్ తో అంతర్గత రవాణా వ్యవస్థ నిర్మాణం. సీఆర్డీఏ పరిధిలోని ఈ పేదల
హౌసింగ్ కాలనీల్లో ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా, ఇళ్ల నిర్మాణానికి మరో రూ.
1,280 కోట్లు, మౌలిక సదుపాయాలకు మరో రూ. 700 కోట్లు ఖర్చు చేయనుంది. మొత్తం
దాదాపు రూ.2,000 కోట్ల వ్యయంతో “వైఎస్సార్ జగనన్న కాలనీ”ల నిర్మాణం.
అక్కచెల్లెమ్మలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా అక్కచెల్లెమ్మల పేరు మీద ఇళ్ల
పట్టాలు, ఇళ్ల రిజిస్ట్రేషన్లు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 30.60 లక్షల ఇళ్ల
స్థలాల పంపిణీ చేశారు. 21 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం. తద్వారా ప్రతి పేద
అక్కచెల్లెమ్మకు కనీసం రూ.5 లక్షల నుండి రూ. 15 లక్షల వరకు లబ్ధి చేకూరనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా పేద అక్కచెల్లెమ్మల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుండి 3
లక్షల కోట్ల సంపద చేకూరనుంది.