43వ డివిజన్ లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మాజీ మంత్రి వెలంపల్లి
విజయవాడ : రాజధాని పేరుతో భూ దందా చేసిన వ్యక్తి చంద్రబాబు అని మాజీ మంత్రి,
పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. స్థానిక 43వ
డివిజన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శుక్రవారం మాజీ మంత్రి పశ్చిమ
నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి శ్రీనివాసరావు శంకుస్థాపనలు చేశారు. ఈ
సందర్భంగా వెలంపల్లి మాట్లాడుతూ 43వ డివిజన్లు పలు అభివృద్ధి పనులకు
శంకుస్థాపన చేయడం జరిగిందన్నారు. గతంలో చంద్రబాబు ఎల్ ఎన్ టి కి వచ్చిన
నిధులను అమరావతికి మళ్లించారన్నారు. 3కోట్లతో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపన
చేశామన్నారు. అన్ని రోడ్లను అభివృద్ది పరిచామని తెలిపారు. మంచినీటి పైపుల
అభివృద్ది చేశామని అన్నారు. నగర వ్యాప్తంగా మంచినీటి సరఫరా చేస్తున్నామన్నారు.
సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న మేయర్ కి ధన్యవాదాలు తెలిపారు. గతంలో
చంద్రబాబు ప్రజలను మోసం చేసి ఏ అభివృద్ది పనులు చెయ్యలేదన్నారు. పార్కులు
అభివృద్ది పరిచామని తెలిపారు. రాజధాని అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు
చేసుకుంటారన్నారు.రాజధాని పేరుతో భూ దందా చేసన వ్యక్తి చంద్రబాబు అని
దుయ్యబట్టారు. మా ఎజెండా మూడు రాజధానులని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధిని
అడ్డుకునే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. నిధులు లేకుండా అమరావతిని అభివృద్ది
పర్చలేమన్నారు. దారి లేని రాజధానిని చంద్రబాబు ఏర్పాటు చేశారని, వందల కోట్లు
డబ్బును వృధా చేశారన్నారు. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన వ్యక్తి చంద్రబాబు
అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, స్థానిక కార్పొరేటర్
బాపతి కోటి రెడ్డి వివిధ డివిజన్ల కార్పొరేటర్లు వివిధ కార్పొరేషన్ల
చైర్మన్లు, డైరక్టర్లు, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.