హాలీవుడ్ స్టార్ దర్శకుడు, టైటానిక్, అవతార్ సృష్టికర్త జేమ్స్ కామెరూన్
ఆర్ఆర్ఆర్ చిత్రంపై ప్రశంసలు కురిపించారు. తాను ఈ చిత్రాన్ని రెండు సార్లు
చూసినట్లు దర్శకుడు రాజమౌళితో చెప్పారు. ఈ విషయాన్ని జక్కన్నే స్వయంగా
సోషల్‌మీడియాలో తెలిపారు. ఆయనతో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేశారు.”ది గ్రేట్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఆయన ఈ
చిత్రాన్ని బాగా ఆస్వాదించారు. తన భార్య సుజీతో కలిసి రెండో సారి కూడా చూశారు.
నాతో మాట్లాడుతూ మీరు ఈ సినిమాను పది నిమిషాల పాటు విశ్లేషించడాన్ని అస్సలు
నమ్మలేకపోతున్నాను సార్ (జేమ్స్ కామెరూన్). మీ ఇద్దరికి ధన్యవాదాలు.” అని
జక్కన్న పేర్కొన్నారు. ఇక కీరవాణి కూడా ఇదే విషయాన్ని ట్వీట్ చేస్తూ.. “ది
గ్రేట్స్ జేమ్స్ కామెరూన్ మా చిత్రాన్ని రెండు సార్లు వీక్షించారు. నా
మ్యూజిక్‌పై ఆయన ఫీడ్‌బ్యాక్ ఇచ్చారు. ఎంతో ఎక్స్ట్మెంట్గా ఉంది” అని ట్వీట్
చేశారు.కాగా, ‘ఆర్ఆర్ఆర్’ నుంచి ‘నాటు నాటు’ పాట ఆస్కార్ షార్ట్
లిస్ట్‌కు ఎంపికైన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ నుంచి 10 చిత్రాలు ఈ ఏడాది
ఆస్కార్ నామినేషన్స్ కోసం పోటీ పడుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన
చిత్రాలన్నింటికీ ఓటింగ్ నిర్వహించి.. నామినేషన్స్‌లో నిలిచిన చిత్రాలను ఈనెల
24న ప్రకటించనున్నారు. అలాగే మార్చి 12న అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది.