రజనీకాంత్ – పి. వాసు కలయికలో వచ్చిన ‘చంద్రముఖి’, చిత్రం ఎంతగా ఆకట్టుకుందో
అందరికి తెలిసిందే. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా ‘చంద్రముఖి 2’ సిద్ధం
చేస్తున్నారు వాసు. తొలి భాగంలో రజనీకాంత్ కథానాయకుడిగా నటించగా రెండవ భాగంలో
రాఘవ లారెన్స్ హీరోగా కనిపించనున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని
నిర్మిస్తుంది. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా వినాయక చవితి
సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ప్రచార కార్యక్రమాల్లో భాగంగా
ఈ చిత్రం నుంచి సోమవారం లారెన్స్ ఫస్ట్ లుక్ విడుదల చేశారు. అందులో ఆయన రాజు
అవతారంలో ఆసక్తికరంగా కనిపించారు. పొగరు, రాజసంతో పాటు క్రూరత్వం కూడా ఆయన
పాత్రలో కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ‘వినోదాత్మకంగా సాగే హారర్ చిత్రమిది”
అని చిత్ర వర్గాలు తెలిపాయి.
ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.
ఈ చిత్రానికి సంగీతం: కీరవాణి,
ఛాయాగ్రహణం: ఆర్.డి.రాజశేఖర్.