పోలీసుల తీరుపై గవర్నర్‌కు ఫిర్యాదు
హైదరాబాద్ : వైఎస్ఆర్టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల గురువారం
రాజ్‌భవన్‌కు వెళ్లనున్నారు. గవర్నర్ తమిళిసై తమిళిసై సౌందరరాజన్‌ను ఆమె భేటీ
కానున్నారు. ఈ మేరకు అపాయింట్మెంట్ ఖరారు అయినట్లు సమాచారం. ఈ సందర్భంగా
పోలీసుల తీరుపై వైఎస్ షర్మిల గవర్నర్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు తెలుస్తోంది.
అక్రమంగా తనను అదుపులోకి తీసుకున్నారని, ఆ టైంలో వ్యవహరించిన తీరును ఆమె
గవర్నర్‌కు వివరించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే వైఎస్ఆర్టీపీ చీఫ్ వైఎస్
షర్మిల అరెస్టుపై సౌందరరాజన్ ఆందోళన వ్యక్తం చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఆమె
కారులో ఉండగానే లాక్కుంటూ వెళ్లిన దృశ్యాలు కలవరపెట్టాయని ఆమె ట్వీట్లో
పేర్కొన్నారు.