విజయవాడ : ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా సత్సంకల్పంతో ముందుకు వెళుతున్నామని తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ కె శివ భాగ్య రావు అన్నారు. విజయవాడ గవర్నర్ పేట ఆల్ తెలుగు ప్రజా పార్టీ కార్యాలయంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆల్ తెలుగు ప్రజా పార్టీ నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ కే శివ భాగ్య రావు మాట్లాడుతూ ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబోవు ఎన్నికలలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలలో, 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో అభ్యర్థులను పోటీలో పెడుతున్నట్లు చెప్పారు. ఏటీపీ పార్టీ సంకల్పం బీసీ ‘వెనుకబడిన వర్గాలకు చెందిన వ్యక్తి’ ని ముఖ్యమంత్రి చేయడం ,ప్రతి కుటుంబాన్ని లక్షాలాధికారులని చేయడం, అవినీతి రహిత పాలన అందించడం వంటి నినాదాలతో పాటు 12 గ్యారెంటీ హామీలతో ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి గడపను తాకడమే కాక ప్రజలలోనికి పార్టీ విధివిధానాలు, సంక్షేమ పథకాలు తీసుకు వెళ్లడం తద్వారా ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి ఆల్ తెలుగు ప్రజా పార్టీ రాబోతుందన్నారు.
పుట్టిన ప్రతి బిడ్డకు తక్షణమే లక్ష రూపాయలు డిఫాజిట్ చేయడం, భూమిలేని ప్రతి కుటుంబానికి మూడు ఎకరాలు భూమి కేటాయించడం, ప్రతి పేదవానికి వ్యవసాయం వ్యాపారం అభివృద్ధి కొరకు పదివేల నుండి 10 లక్షల వరకు పావలా వడ్డీకే రుణం, కేజీ నుండి పీజీ వరకు అందరికీ కార్పొరేట్ ఉచిత విద్య, ముఖ్య మంత్రి నుండి సామాన్య ప్రజల వరకు ఉచిత వైద్య పరీక్షలు మందులు అందించడం, రాష్ట్రాన్ని గుడిసెలు లేని రాష్ట్రముగా తయారు చేయడం, నిరుద్యోగ నిర్మూలన చేయడం, అవినీతి నిర్మూలన, విడతల వారీగా మద్యం నిషేధం ,పేదలకు ఉచిత న్యాయ సహాయం, వాలంటీర్ వ్యవస్థను పూర్తి జీతంతో నియమించడం,కాపులకు 15% రిజర్వేషన్స్, జనాభా నిష్పత్తి ప్రకారం ఎవరు ఎంతో వారికి అంత అనే విధంగా రిజర్వేషన్లు కల్పించడం లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ స్పోర్ట్స్ పర్సన్ డా. తమనం విజయ్ కుమార్, స్టేట్ కన్వీనర్ నమ్మి అప్పారావు యాదవ్, వైస్ ప్రెసిడెంట్ కె రవికుమార్, చింతల కృష్ణ ద్రాక్షారం సూరిబాబు,రిక్కా గురుమూర్తి , ధనాలకోటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.