విజయవాడ : గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని విజయవాడ రాజ్ భవన్ లో
నిర్వహించిన ఎట్ హోమ్ కార్యక్రమం వేడుకగా సాగింది. తొలుత ముఖ్యమంత్రి వైఎస్
జగన్ మోహన్ రెడ్డి, భారతీ రెడ్డి దంపతులు రాజ్ భవన్ కు చేరుకోగా గవర్నర్
బిశ్వభూషన్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులను స్వాగతించారు. జాతీయ గీతాలాపన
అనంతరం గవర్నర్ హరిచందన్ కార్యక్రమానికి హాజరైన వారి వద్దకు స్వయంగా వెళ్లి ,
వారిని పలకరిస్తూ, అందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సిఎం, గవర్నర్,
హైకోర్టు సిజె ప్రశాంత్ కుమార్ మిశ్రా, సుచేతా మిశ్రా దంపతులు ఒక చోట
కూర్చుని, రాజ్ భవన్ అతిధ్యాన్ని స్వీకరించారు. హైకోర్టు న్యాయమూర్తులు,
పబ్లిక్ సర్వీస్ కమీషన్ ఛైర్మన్, సభ్యులు, సమాచార హక్కు చట్టం కమీషనర్లు,
సీనియర్ ఐఎఎస్, ఐపిఎస్ అధికారులు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ పాత్రికేయులు,
కార్యక్రమానికి పెద్ద ఎత్తున హాజరు కాగా గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన
కార్యదర్శి ఆర్ .పి సిసోడియా కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.