వేడుకలు నిర్వహించారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సుప్రవ హరిచందన్ దంపతులకు
పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు శుభాకాంక్షలు తెలిపి ఆశీస్సులు
తీసుకున్నారు. దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యన్నారాయణ కుటుంబ సమేతంగా
విచ్చేసి గవర్నర్ బిశ్వభూషణ్ హరించదన్ కు శుభాకాంక్షలు తెలిపారు.గవర్నర్ వారి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్ పి సిసోడియా, ముఖ్య అధికారులు
గవర్నర్ దంపతులకు పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. తిరుమల తిరుపతి
దేవస్ధానం, విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం పండితులు
మంత్రోచ్ఛరణతో గవర్నర్ దంపతులను అశీర్వదించి శ్రీవారి ప్రసాదం, అమ్మవారి
చిత్రపటం, ప్రసాదం అందించారు. పార్లమెంటు సభ్యుడు నందిగం సురేష్, శాసన
పరిషత్తు సభ్యుడు, ముఖ్యమంత్రి కార్యక్రమాల అమలు కమిటీ ఛైర్మన్ తలశిల రఘురాం,
తిరుమల తిరుపతి దేవస్ధానం ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి గవర్నర్ కు నూతన సంవత్సర
శుభాకాంక్షలు అందించారు.
బిసి సంక్షేమ శాఖ సంచాలకుడు అర్జున రావు, ఎన్ టి ఆర్ జిల్లా పాలనాధికారి
డిల్లీ రావు, మైనారిటీ సంక్షేమ శాఖ డైరెక్టర్ కిషోర్, ఎన్ టిఆర్ జిల్లా
సంయిక్త పాలనాధికారి నుపూర్ అజయ్ కుమార్, విజయవాడ నగర పాలక సంస్ధ కమీషనర్
స్వప్నిల్ దినకర్ తదితరులు గవర్నర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలిపారు.
ముఖ్య సమచార కమీషనర్ ఆర్ ఎం భాషా, కమీషనర్లు బివి రమణ కుమార్, కాకర్ల
చెన్నారెడ్డి, పి.శ్యామ్యూల్ జొన్నాధన్ , ప్రోటోకాల్ డైరెక్టర్ బాలసుబ్రమణ్య
రెడ్డి తదితరులు గవర్నర్ ను కలిసిన వారిలో ఉన్నారు. రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్
శాఖ ఛైర్మన్ డాక్టర్ శ్రీధర్ రెడ్డి, కార్యదర్శి ఫరీడాలతో పాటు, రాజ్ భవన్
సంయిక్త కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప కార్యదర్శి నారాయణ స్వామి, శ్రీ
దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్ధానం కార్యనిర్వహణ అధికారి భ్రమరాంబ
తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.