తప్పులు చేస్తుంటారు. ఇది ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంటుంది.
కొన్ని కాంబినేషన్స్ శరీరానికి అస్సలు మంచివి కావు. కొంతమంది అన్నంలో
అరటిపండు, మామిడిపండును తీసుకుంటారు. ఇలా తినడం వల్ల అసౌకర్యంతో పాటు
అనారోగ్యం తోడవుతుంది.
*భోజనం చేసిన వెంటనే పండ్లను తింటే త్వరగా జీర్ణంకావని చెబుతున్నారు నిపుణులు.
భోజనం చేసిన వెంటనే పండ్లను తీసుకుంటే భోజనంతో పాటు ఇతర ఆహారాలతో కలిసి అది
రియాక్షన్ గా ఏర్పడుతుందట. దీని ఫలితంగా ఎక్కువ ఆమ్లాలు ఉత్పత్తి అవుతాయి.
దీంతో పండ్లలోని పోషకాలు సరైన పద్ధతిలో శరీరానికి అందవు. అందుకే భోజనం చేసిన
కనీసం గంట, రెండు గంటల తర్వాత పండ్లను తీసుకోవాలి.
అరటి:
భోజనం చేసిన వెంటనే చాలా మంది అరటిపండ్లు తింటారు. కానీ తిన్న వెంటనే
అరటిపండ్లు తినడం వల్ల జలుబు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుందట. మరికొంతమంది
నిద్రపోయే ముందు అరటిపండ్లు తింటుంటారు. దీనివల్ల నిద్రలేమితో
బాధపడాల్సివస్తుంది. కాబట్టి అరటిపండ్లు తినాలనుకునేవారు మధ్యాహ్న
సమయంలో తినడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
నారింజ:
నారింజ, నిమ్మ,బత్తాయి వంటి
సిట్రస్ పండ్లలో యాసిడ్స్ ఉంటాయి. కాబట్టి వీటిని తినడానికి గంటముందు, లేదంటే
తిన్న గంట తర్వాత పండ్లు తినడం మంచిది. లేదంటే యాసిడ్ రిఫ్లక్స్ వల్ల
గుండెల్లో మంటగా అనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా సిట్రస్ పండ్లను పాలతో
కూడా కలిపి తీసుకోరాదు.
పాలకూర:
పాలకూర, పనీర్ కాంబినేషన్ చాలా ఎక్కువ మంది తింటుంటారు. రెస్టారెంట్లలోనూ వెజ్
తినాలనుకుంటే ఎక్కువగా పాలక్ పనీర్ తినేందుకు మొగ్గు చూపుతారు. ఈ కాంబినేషన్
అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఈ కాంబినేషన్ వల్ల పాలకూరలోని
పోషకాలు నాశనం అవుతాయని చెప్తున్నారు. పాలక్ పనీర్ ఎక్కువగా కాల్షియం, ఐరన్
ఉంటాయి. కాల్షియం కారణంగా ఐరన్ ను శరీరం గ్రహించుకోలేదు. అందుకే వీటికి దూరంగా
ఉండడం ఉత్తమం.