ఇష్టం వచ్చిన పదార్థాలు తింటారు. అయితే రాత్రిపూట తినేటప్పుడు అనేక జాగ్రత్తలు
తీసుకోవాలి. రాత్రిపూట తినకూడని పదార్ధాలను ఇప్పుడు చూద్దాం..
1.కాఫీ:
రాత్రిపూట కెఫిన్ కంటెంట్ ఉన్న టీ, కాఫీలకు దూరంగా ఉండాలి. అదే సమయంలో కూల్
డ్రింక్స్, ఐస్ క్రీమ్ వంటివి దూరం పెట్టాలి. వీటిని రాత్రిపూట తింటే నిద్ర
సరిగా రాదు. వీటిని తినడంతో ఎసిడిటీ సమస్యలు పెరుగుతాయి.
2.స్వీట్స్:
రాత్రి నిద్రపోయే ముందు స్వీట్స్ అస్సలు తినొద్దు. స్వీట్స్ రక్తంలో చక్కెర
స్థాయిలను పెంచుతాయి. వీటిని తినడంతో రాత్రిపూట నిద్రకు భంగం కలుగుతుంది.
3.వంకాయ:
రాత్రిపూట ఆహారంలో టైరమైన్ రిచ్ ఫుడ్స్ లేకుండా చూసుకోవాలి. టైరమైన్ కంటెంట్
నిద్రకు భంగం కలిగిస్తుంది. ముఖ్యంగా టమాటా, వంకాయ తినడంతో మెదడు యాక్టివ్
అవుతుంది. నిద్ర సరిగా రాదు.
3.స్పైసీ ఫుడ్:
రాత్రి నిద్రపోయే ముందు స్పైసీ ఫుడ్ కు దూరంగా ఉండాలి. స్పైసీ ఫుడ్ కడుపులో
యాసిడ్ స్థాయిలను పెంచుతుంది. దీంతో నిద్రకు భంగం కలుగుతుంది. ఎసిడిటీ సమస్యలు
పెరుగుతాయి.
4.సిట్రస్ జ్యూస్:
రాత్రి నిద్రపోయే ముందు సిట్రస్ జ్యూస్ తాగకూడదు. పచ్చి ఉల్లిపాయలు, టామాటా
సాస్ తినకూడదు. ఇవి కడుపులో యాసిడ్ స్థాయిలను వేగంగా పెంచుతాయి. దీంతో నిద్ర
సరిగా రాదు.
5.పుచ్చకాయ:
రాత్రిపూట నీటి శాతం అధికంగా ఉన్న ఆహారాలకు దూరంగా ఉండాలి. నీరు అధికంగా ఉన్న
పదార్దాలు తినడంతో మూత్ర విసర్జణ కోసం మేల్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా
పుచ్చకాయ, కీరాకు దూరంగా ఉండాలి.
6.అతిగా తినకండి:
రాత్రి పూట అతిగా ఆహారం అస్సలు తినకూడదు. ముఖ్యంగా రాత్రి భోజనంలో కొవ్వు,
నూనె పదార్థాలు ఉండకూడదు. ఇవి జీర్ణం అయ్యేందుకు చాలా టైం పడుతుంది. దీంతో
నిద్రకు భంగం కలుగుతుంది.