డిసెంబరులోనే యాసంగి రైతుబంధు
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఖమ్మం : డిసెంబరులోనే యాసంగి రైతుబంధును ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ
చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
రాబోయే రోజుల్లో రుణమాఫీ కచ్చితంగా చేస్తామని మంత్రి చెప్పారు. ఖమ్మం
జిల్లాలోని రఘునాథపాలెం మండలం జింకలతండాలో మంత్రి పువ్వాడ అజయ్‌తో కలిసి
మంత్రి నిరంజన్‌రెడ్డి 3 గిడ్డంగులు ప్రారంభించారు. జింకలతండాలో రూ.14.9
కోట్లతో 20 వేల టన్నుల సామర్థ్యంతో నిర్మించిన ఈ గిడ్డంగుల్లో ప్రభుత్వం
కొనుగోలు చేసిన పంటలను ఈ నిల్వ చేయనున్నారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాబోయే
రోజుల్లో రుణమాఫీ కచ్చితంగా చేస్తాం. తెలంగాణ సాగు ఉత్పత్తులు త్వరలో దేశంలోనే
ముఖ్యపాత్ర పోషిస్తాయి. కేంద్ర ప్రభుత్వం ధాన్యాన్ని కొనుగోలు చేయకపోతే
రాష్ట్రమే ఖర్చు భరించింది. గుజరాత్లో 24 గంటల నిరంతర విద్యుత్ ఎందుకు
ఇవ్వడం లేదు? భాజపా పాలిత రాష్ట్రాల్లో ఒక్క నీటిపారుదల ప్రాజెక్టు ఎందుకు
కట్టలేదు? తెలంగాణలో రైతు కేంద్రంగా పాలన సాగుతోందని నిరంజన్ రెడ్డి అన్నారు.