వైసిపి జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
నరసన్నపేట : దుండగుల చేతిలో హత్యకు గురైన బరాటం రామ శేషు ఉదంతం దిగ్భ్రాంతికి
గురి చేసిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్
అన్నారు. యువ నాయకత్వాన్ని దారుణ సంఘటనతో కోల్పోవడం అత్యంత బాధాకరమన్నారు.
వారి కుటుంబానికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని కృష్ణ దాస్
తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పార్టీ తరపున కుటుంబానికి అండగా
ఉండాలని ఆదేశించారని అన్నారు. నరసన్నపేట నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలిసి ఆయన
సోమవారం ఉదయం శ్రీకూర్మంలోని రామశేషు ఇంటికి వెళ్లి వారి తండ్రి బరాటం
నాగేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. తీవ్ర దుఃఖంలో ఉన్న
వారిని ఓదార్చి, ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. హత్య వెనక ఉన్న దుండగులకు
కఠిన శిక్ష పడుతుందని అన్నారు. మంచి భవిష్యత్తు ఉన్న నాయకుడిగా గుర్తింపు
పొందిన అతడు చిన్న వయసులోనే దూరమవ్వడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.
పరామర్శికు వెళ్లిన వారిలో డిసిసిబి చైర్మన్ కరిమి రాజేశ్వరరావు, ఎంపీపీలు
ఆరంగి మురళిధర్, వాన గోపి సుడా చైర్పర్సన్ ప్రతినిధి కోరాడ చంద్రమోహన్ గుప్తా,
పోలాకి ఎంపీపీ ప్రతినిధి ముద్దాడ బైరాగినాయుడు, గార ఎంపీపీ గొండు రఘురాం,
బుర్రా ఆదినారాయణ శాస్త్రి గొండు కృష్ణమూర్తి, తంగి మురళీకృష్ణ, రాజాపు
అప్పన్న, తదితరులున్నారు.