బాలకృష్ణ కథానాయకుడిగా షైన్ స్క్రీన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘భగవంత్
కేసరి’. కాజల్ కథానాయిక. మరో కథానాయిక శ్రీలీల ముఖ్య పాత్రని పోషిస్తున్నారు.
అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. సాహు గార పాటి, హరీష్ పెద్ది నిర్మా
తలు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రధాన
తారాగణంపై ఓ పాటని తెరకెక్కిస్తున్నారు. భాను నృత్య దర్శకత్వం వహిస్తున్నారు.
“సినిమాలో కీలకమైన సందర్భంలో వచ్చే పాట ఇది. భారీ హంగులతో తెరకెక్కిస్తున్నాం.
ప్రేక్షకులకు కనువిందులా ఉంటుంది. బాలకృష్ణ ఈ సినిమాలో శక్తిమంతమైన పాత్రలో
ఇదివరకెప్పుడూ చూడని ప్రత్యేకమైన లుక్ లో సందడి చేస్తారు. ఆయన తెలంగాణ యాసలో
చెప్పే సంభాషణలు సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు తెలిపాయి.
దసరా సందర్భంగా అక్టోబరు 19న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రంలో బాలీవుడ్
నటుడు అర్జున్ రాంపాల్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తమన్ స్వరాలు
సమకూరుస్తున్నారు. సి. రాంప్రసాద్ ఛాయాగ్రాహకుడు.