విజయవాడ : రాయలసీమలో ప్రతి పక్షపార్టీలకు ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అన్నారు. టిడిపి నాయకులు తల కిందకి, కాళ్ళు పైకి లేపినా ఇలాంటి సభలు పెట్టలేరన్నారు. చంద్రబాబు, లోకేష్ పెట్టే సభలకు జనం రావడం లేదని, అందుకే పవన్ కళ్యాణ్ కోసం ఎదురు చూస్తున్నారని ఆయన విమర్శించారు. రెండు నెలలు తర్వాత టిడిపి నామరూపాలు లేకుండా పోవడం తధ్యమని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు. అనంత పురం జిల్లా రాప్తాడులో ముఖ్య మంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్న సిద్దం బహిరంగ సభ కనీవినీ ఎరగని రీతిలో రాయలసీమలో సముద్రం లేకపోయినా జన సముద్రం తో జయప్రదం చేసినందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డికి వైసిపి రాష్ట్ర నాయకులు ఆకుల శ్రీనివాస్ కుమార్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సిద్ధం బహిరంగ సభ గురించి పెద్దిరెడ్డి మీద పెట్టిన బాధ్యతను రెట్టింపు ఉత్సాహంతో పెద్దిరెడ్డి నెరవేర్చారన్నారు. ప్రతిపక్ష పార్టీలకు మైండ్ బ్లాక్ అయ్యేలా స్థానిక ఎమ్మెల్యేలను, నాయకులను సమన్వయం చేసి రాయల సీమ చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా నభూతో నభవిష్యతి అనే విధంగా సిద్ధం బహిరంగ సభ జరిగిందని ఆకుల శ్రీనివాస్ పేర్కొన్నారు.