విజయవాడ : తాడేపల్లిగూడెం ప్రైమ్ నైన్ రిపోర్టర్ రావూరి చెన్నకేశవ మృతిపై
విచారణ జరుపుతామని సమాచార శాఖ కమిషనర్ టి విజయ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్ట్ అసోసియేషన్ ప్రతినిధి వర్గం సోమవారం
ఆయనను కలిసి వినతిపత్రం అందజేసింది. సమాచార శాఖ జాయింట్ డైరెక్టర్ కస్తూరి
కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఇటీవల కాలంలో మీడియాలో విలేకరులపై పెరుగుతున్న
పని భారం, టార్గెట్లు పెట్టి పీడించటం, తదితర అంశాల కారణంగా మృతి చెందుతున్న
సంఘటనలు ఇప్పటికే కొన్ని జరిగాయి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని వెంటనే
విచారణ జరపాలని ఏపీబీజేఈ సమాచార శాఖను కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన
కమిషనర్ పరిస్థితులను గమనిస్తున్నామని తప్పనిసరిగా తగిన చర్యలు తీసుకుంటామని
ఆయన హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలిసిన ప్రతినిధి వర్గంలో ఏపీ బీజేఏ ప్రధాన
కార్యదర్శి బి శ్రీనివాసరావు, కృష్ణాజిల్లా కన్వీనర్ అబ్దుల్ అలీమ్ ఉన్నారు.