డా.బి.ఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవ వేడుక పనులు పరిశీలించిన
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిహైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు హుస్సేన్ సాగర్ తీరాన డా.బి.ఆర్
అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం ప్రారంభోత్సవం ఏర్పాట్లను రాష్ట్ర రోడ్లు భవనాల
శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. విగ్రహ
ప్రాంగణం, సభాస్థలి, అతిథులు, ప్రముఖులు, పలువురు ప్రజలు వచ్చే ప్రాంతాల్లో
ఏర్పాట్లను పర్యవేక్షించారు. నగర సిపి సి.వి ఆనంద్, పోలీస్ సిబ్బంది తో
ట్రాఫిక్,ప్రధాన సభాస్థలి, కళాకారుల సభాస్థలి,సభకు వచ్చే అతిథుల ఎంట్రీ,
ఇతరులకు సంబంధించిన ఎంట్రీ, కుర్చీలు,వాహనాల పార్కింగ్ తదితర అంశాలపై
చర్చించారు.

రాష్ట్ర రాజదాని నడిబొడ్డున అంబేద్కర్ మహనీయుని జయంతోత్సవ వేడుక అంగరంగ
వైభవంగా కన్నుల పండువగా జరగనుందని మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కి
భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారంటే అమితమైన ప్రేమని,దానికి తార్కాణం 125
అడుగుల విగ్రహం అని అధికారులు, పోలీస్ సిబ్బంది విగ్రహ ప్రారంభోత్సవ వేడుక
కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. మంత్రి వెంట ఎమ్మెల్యే రసమయి
బాలకిషన్,ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి,మల్లేపల్లి
లక్ష్మయ్య,కార్పొరేషన్ చైర్మన్ సాయి చంద్,బి.సి కమిషన్ మెంబర్ కిషోర్ గౌడ్,ఆర్
అండ్ బి ఈఎన్సి గణపతి రెడ్డి పలువురు అధికారులు,అసెంబ్లీ సెక్రెటరీ నర్సింహ
చార్యులు పలువురు ఉన్నారు.