విజయవాడ : రాష్ట్రంలో కొత్తగా 875 రోడ్లను పునరుద్థరించాలని ప్రభుత్వం
నిర్ణయించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ
సభ్యులు విజయసాయిరెడ్డి తెలిపారు. ఒక్కో నియోజక వర్గంలో కీలకమైన ఐదు రోడ్లను
యుద్ధ ప్రాతిపాదికన పునరుద్ధరించేందుకు ప్రభుత్వం సిద్ధమైందని చెప్పారు. నదీ
పరివాహక ప్రాంతాల్లో ఫుల్ డెప్త్ రిక్లమేషన్(ఎఫ్డీఆర్) టెక్నాలజీతో రోడ్ల
నిర్మించాలని నిర్ణయించిందని, ఉమ్మడి ఉభయ గోదావరి, కృష్ణా గుంటూరు జిల్లాల్లో
ఎఫ్డీఆర్ టెక్నాలజీతో వెయ్యి కిలో మీటర్ల మేర రోడ్లు నిర్మించారని సిఎం జగన్
మోహన్ రెడ్డి ఇటివల సంబందిత అధికారులను ఆదేశించారని అన్నారు. గతంలో రోడ్ల
పునరుద్ధరణ నిధులను తెలుగుదేశం ప్రభుత్వం పసుపు కుంకుమ ఫథకానికి
మళ్లిచిందనన్నారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలో పెట్టుబడులకు ఏపీ
స్వర్గధామంగా మారిందని తెలిపారు. రాష్ట్రం గత మూడేళ్ల కాలంలో రూ.3.2 లక్షల
కోట్లు పెట్టుబడులను ఆకర్షించిదని ఆయన చెప్పారు. పలు అంశాలపై ఆదివారం సోషల్
మీడియాలో విజయ సాయిరెడ్డి స్పందించారు.