తెనాలి : టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి
ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు చూసి
ప్రతిపక్షానికి కడుపుమంటగా ఉంది. కడుపు మంటకు, అసూయకు అసలే మందు లేదంటూ సీఎం
సెటైర్లు వేశారు. కాగా తెనాలిలో నాలుగో ఏడాది కూడా వైఎస్సార్ రైతు భరోసా పీఎం
కిసాన్ నిధులను సీఎం జగన్ విడుదల చేశారు. ఈ సందర్బంగా సీఎం జగన్ మాట్లాడుతూ
‘రాష్ట్రంలో ఈరోజు యుద్ధం జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో కరువుతో స్నేహం చేసిన
చంద్రబాబుకు మీ బిడ్డకు మధ్య యుద్ధం జరగబోతోంది. వచ్చే ఎన్నికల్లో ఇంగ్లీష్
మీడియం వద్దన్న చంద్రబాబుకు మీ బిడ్డకు యుద్ధం జరగబోతోంది. రాష్ట్రంలో గజ
దొంగల ముఠా ఉంది. ఈ ముఠా పని దోచుకో.. పంచుకో.. తినుకో మాత్రమే. గజదొంగల
ముఠాలో ఇంకొకరు దత్తపుత్రుడు. దుష్టచతుష్టయానికి తోడు దత్తపుత్రుడు జత
కలిశాడు. చంద్రబాబు ఎందుకు సంక్షేమ పథకాలు పెట్టలేకపోయాడు. ఆ డబ్బులన్నీ ఎవరి
జేబుల్లోకి వెళ్లాయి?. ఇప్పుడు కూడా అదే బడ్జెట్, అదే రాష్ట్రం. పేదలకు ఇళ్ల
స్థలాలు ఇవ్వడానికి వ్యతిరేకం అన్నాడు చంద్రబాబు. మీ బిడ్డ పాలనకు.. చంద్రబాబు
పాలనకు వ్యత్యాసాన్ని గమనించాలి. మంచి చేశాం, మంచి జరిగిందని అనిపిస్తే తోడుగా
ఉండండి. మీ ఇంట్లో మంచి జరిగిందో లేదో చూసుకోండి. ఇచ్చిన హామీలు అన్ని
నెరవేస్తున్నాం. చంద్రబాబుకు, దత్తపుత్రుడికి సవాల్ విసురుతున్నాను. 175కి
175 నియోజకవర్గాల్లో పోటీ చేసి గెలిచే ధైర్యం ఉందా?. మీ బిడ్డకు భయంలేదు. నా
దగ్గర ఈనాడు లేదు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లేదు.. దతపుత్రుడు లేడు. అయినా సరే..
మేము చేసిన మంచి చెప్పుకునే మళ్లీ అధికారంలోకి వస్తామని అన్నారు.
రైతే అసలైన శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్: రాష్ట్ర వ్యవసాయ శాఖ
మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రైతే అసలైన
శాస్త్రవేత్త అని నమ్మిన వ్యక్తి సీఎం జగన్. ఏ సీజన్లో పంట నష్టం ఆ
సీజన్లోనే అందిస్తున్న ఏకైన సీఎం వైఎస్ జగన్. దేశంలోనే వందశాతం రైతు బీమా
ప్రీమియం భరించిన ఏకైన రాష్ట్రం ఏపీ. చంద్రబాబు హయంలో అన్నీ కరువు కాటకాలే అని
అన్నారు.
తెనాలి గడ్డ.. జగనన్న అడ్డా : తెనాలి ఎమ్మెల్యే శివకుమార్
తెనాలి ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ పాదయాత్ర రాష్ట్రంలో ప్రజల
గుండె చప్పుడు. రాష్ట్రంలో ప్రజలకు సంక్షేమ పాలన అందుతోంది. రైతు భరోసా,
అమ్మఒడి, జగనన్న విద్యాకానుక, చేయూత వంటి పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగకరం.
జగనన్న సేవకుడు శివకుమార్ అన్ని అన్నారు. నియోజకవర్గంలో పేదలకు 26వేల ఇళ్లు
ఇచ్చిన ఘనత సీఎం జగనన్నకే దక్కింది. తెనాలి గడ్డ.. జగనన్న అడ్డ అని అన్నారు.