జగన్ ప్రభుత్వంలో ఎస్సీ, బీసీ, మైనారిటీలపై దాడులు * సహజ వనరులను అదానీ,
అంబానీలకు దారాధత్తం *బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ * దర్శి ఘటనపై ఫాస్ట్
ట్రాక్ కోర్ట్ ఏర్పాటు చేయాలి * వెనుకబాటుతనం ఆసరాగా తీసుకుని హత్యలు,
మానభంగాలు * ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు
విజయవాడ : ముఖ్యమంత్రిగా జగన్ అధికారం చేపట్టిన తరువాత రాష్ట్రంలో శాంతి
భద్రతలు గాడి తప్పాయని, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగిగాయని పీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు స్పష్టం చేశారు. ఏపీ కాంగ్రెస్ మీడియా సెల్
ఛైర్మన్ తులసిరెడ్డితో కలిసి సోమవారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్ లో ఆయన
మీడియాతో మాట్లాడారు. ప్రకాశం జిల్లా దర్శిలో దాడికి గురైన మౌనిక తల్లి
అనురాధను తాను స్వయంగా పరామర్శించిన సందర్భాన్ని గుర్తు చేస్తూ.., ఇప్పటికీ
బాధితులు ప్రాణభయంతో ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే ఫాస్ట్ ట్రాక్
కోర్టు ఏర్పాటు చేసి కేసును పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అమానుష దాడి జరిగినా చుట్టుపక్కల ఉన్నవారు గానీ, గ్రామస్తులు గానీ బాధితులతో
మాట్లాడటానికి కూడా భయపడుతున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో సహా, మహిళా
హోం మంత్రి, సంబంధిత జిల్లా మంత్రి కూడా జరిగిన ఘటనపై ఇంత వరకు కనీసం
స్పందించక పోవడం రాష్ట్ర ప్రభుత్వానికి దళితులపై ఉన్న చిత్తశుద్ధికి, కపట
ప్రేమకు నిదర్శమని ఆయన తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలలో ఉన్న
వెనుకబాటుతనాన్ని ఆసరాగా తీసుకుని హత్యలు, మానభంగాలు, దాడులు చేస్తున్నారని
రుద్రరాజు ఆవేదన వెలిబుచ్చారు.
ఎన్నో ఆక్రుత్యాలు : గత నాలుగు సంవత్సరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ
వర్గాలపై ఎన్నోఆక్రుత్యాలు జరిగాయని పీసీసీ అధ్యక్షులు రుద్రరాజు స్పష్టం
చేశారు. గుంటూరు జిల్లాలో తన సోదరిపై జరుగుతున్న వేధింపులను ప్రశ్నించినందుకు
అమర్నాధ్ గౌడ్ అనే మైనర్ ను దారుణంగా కొట్టి సజీవ దహనం చేశారన్నారు. అదే
విధంగా దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన శాసన
మండలి సభ్యుడిపై చర్యలు శూన్యమన్నారు. దళిత జడ్జి రామక్రిష్ణ పై దాడులు చేసి
వారి ఇంటిని ధ్వంసం చేయడమే కాకుండా అక్రమ కేసులూ బనాయించినట్లు వివరించారు.
పీపీఈ కిట్లు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ ను చిత్ర హింసలు పెట్టి, ఆయన
మరణించడానికి రాష్ట్ర ప్రభుత్వమే పరోక్ష కారణం అయ్యిందని విమర్శించారు. బడుగు,
బలహీన, మైనారిటీలపై సీఎం జగన్ చూపిస్తున్నది అంతా కపట ప్రేమ అని ప్రజలు
ఇప్పుడు గుర్తిస్తున్నారని తెలిపారు.
ప్రపంచం మొత్తం మణిపూర్ వైపు చూసినా : మణిపూర్ లో జరిగిన హింసను ప్రపంచంలో
ఎన్నో సంస్థలు ఖండించినా ముఖ్యమంత్రి జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఎన్డీఏ
భాగస్వామి పవన్ కళ్యాణ్ కనీసం ఖండించక పోవడం దారుణ విషయమని పీసీసీ అధ్యక్షులు
పేర్కొన్నారు. అసలు బీజేపీ అంటేనే బాబు, జగన్, పవన్ అంటూ ఆయన ఎద్దేవా చేశారు.
బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులను ఖండించకుండా వారిని కేవలం ఓటు బ్యాంకుగానే
చూస్తున్నారని మండి పడ్డారు. కనీసం కుర్చీలు, బెంచీలు కూడా లేని కార్పొరేషన్లు
ఇస్తే వెనుకబడిన వర్గాలకు ఏం ఉపయోగం అని రుద్రరాజు ప్రశ్నించారు. సమాజంలో
గౌరవంతో పాటు సమాన హక్కులు, అవకాశాలను వారు కోరుకొంటున్నారని చెప్పారు.
సహజ వనరులను దోచిపెట్టేందుకు జాతీయ రహదారులు : ఉత్తరాంధ్ర ప్రాంతంలో సహజ
వనరులను దోచి పెట్టేందుకు ఏకంగా జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతోందని పీసీసీ
అధ్యక్షులు గిడుగు రుద్రరాజు విమర్శించారు. అరకు, పాడేరు, చింతపల్లి వంటి
ప్రాంతాల్లో కనీసం గ్రామ కమిటీలు లేవని తెలిపిన ఆయన, అక్కడ ఉన్న సహజ వనరులను
మైనింగ్ ద్వారా అదానీ, అంబానీ సంస్థలకు దారాధత్తం చేసేందుకు ఎన్ హెచ్ 5
నిర్మాణం శరవేగంగా జరుగుతుందని పేర్కొన్నారు. సీఎం జగన్ ఒక పధకం ప్రకారం
కాంగ్రెస్ పథకాలను, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరును అక్రమంగా వాడుకుని లబ్ధి
పొందుతున్నారని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు న్యాయం
జరగాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆయన తేల్చి చెప్పారు.
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేకు ధన్యవాదాలు : నూతన
సీడబ్ల్యుసీ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన రఘువీరారెడ్డి, సుబ్బిరామిరెడ్డి,
పళ్లంరాజు, కె.రాజులకు స్థానం కల్పించడంపై ఏఐసీసీ అధ్యక్షులు మల్లిఖార్జున
ఖర్గేకు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు ధన్యవాదాలు తెలిపారు.
రాష్ట్రంలో కేవీపీ వంటి ఎందరో సీనియర్ కాంగ్రెస్ నేతలు ఉన్నారని వారికి కూడా
అవకాశాలు కల్పిస్తే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ కు పునర్వైభవం వస్తుందన్నారు.
రాబోయే మధ్య ప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్ ఘడ్, తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్
పార్టీ ఘన విజయం సాధిస్తుందని ఆశాభవం వ్యక్తం చేసిన ఆయన, ఆ నాలుగు రాష్ట్రాల
ఎన్నికల ఫలితాల ప్రభావం రాష్ట్రం పై ఉంటుందని తెలిపారు. అదే విధంగా పొత్తులపై
జాతీయ స్థాయిలో నిర్ణయం ఉంటుందని, సీపీఐ నేత రామక్రిష్ణతో ఇప్పటికే కొన్ని
విషయాలు చర్చించినట్లు రుద్రరాజు వివరించారు.
దుష్ట చతుష్టయాన్ని ఓడించాలి : ఏపీ కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి
దుష్టచతుష్టయం పార్టీలైన బీజేపీ, వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను ఓడించాలని
ఏపీ కాంగ్రెస్ మీడియా సెల్ ఛైర్మన్ తులసిరెడ్డి పిలుపునిచ్చారు. పీసీసీ
అధ్యక్షులు రుద్రరాజుతో కలిసి మీడియాతో మాట్లాడిన ఆయన, కేంద్రంతో పాటు
రాష్ట్రంలోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం చారిత్రాత్మక ఆవశ్యకత అని
తెలిపారు. గుజరాత్ మోడల్ అంటూ 2014, 2019ల్లో దేశ ప్రజలను మోడీ మోసం చేశారని
స్పష్టం చేశారు. గుజరాత్ లో 38 శాతం మంది పౌష్టికాహార లోపంతో బాధ
పడుతున్నారని, మూడింట రెండు వంతుల ప్రజలకు కనీసం సొంత ఇల్లు కూడా లేదనే
విషయాన్ని నీతి ఆయోగ్ బయట పెట్టిందని తులసిరెడ్డి ఎద్దేవా చేశారు. తనకు ఎవరి
బలం లేదని చెప్పుకునే జగన్ 2019 నాటికే రూ.510 కోట్లతో దేశంలోనే అత్యంత ధనిక
ముఖ్యమంత్రిగా ఉన్నారని ఎన్నికల అఫిడవిట్ సాక్ష్యం ఉందన్నారు. వైసీపీ ధనవంతుల
పార్టీ అని, ఆ పార్టీకి చెందిన 9 మంది ఎంపీలలో నలుగురికి వెయ్యి కోట్ల
రూపాయిలకుపైగా ఆస్తులు ఉన్నట్లు ఆయన వెల్లడించారు.
రూ.6 లక్షల వ్యవసాయ రుణమాఫీ : కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆరు సూత్రాల
కార్యక్రమాన్ని చేపడతామని ప్రకటించిన తులసిరెడ్డి రైతులకు రూ.6 లక్షల వరకు
వ్యవసాయ రుణమాఫీ చేస్తామని తెలిపారు. అదే విధంగా మహిళలకు రూ.500కే వంట గ్యాస్
అందిస్తామన్నారు. పేదలకు నెలకు రూ.6వేల ఆర్థిక సాయం చేస్తామని, ప్రత్యేక
హోదాతో పాటు విభజన చట్టంలోని పోలవరం, కడప స్టీల్ ప్లాంట్, దుగరాజుపట్నం పోర్ట్
వంటి అపరిష్క్రుత హామీలను అన్నింటినీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అదే
విధంగా రాయలసీమ, ఉత్తరాంధ్రకు బుందేల్ ఖండ్ తరహా ప్యాకేజీని అందించి
అభివ్రుద్ధి పరుస్తామని తులసిరెడ్డి ప్రకటించారు. కార్యక్రమంలో విజయవాడ నగర
అధ్యక్షులు నరహరిశెట్టి నరసింహారావు, ఏఐసీసీ సభ్యులు వి.గుర్నాధం పాల్గొన్నారు.