విజయవాడ : నేటికీ జగన్ మోహన్ రెడ్డి చేసిన ప్రజా సంకల్ప యాత్ర చేసి 4 ఏళ్లు
పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక 34వ డివిజన్ ఎఱ్ఱకట్ట డౌన్ లో గల వైఎస్ఆర్
విగ్రహానికి మాజీ మంత్రి పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు వెలంపల్లి
శ్రీనివాసరావు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ
రాష్ట్రంలో ఒక్క చక్కటి మార్పు తెచ్చేందుకు ప్రజా సంకల్ప యాత్ర చేసి నేటికీ 4
ఏళ్లు అని కొనియాడారు. పాదయాత్ర లో ఇచ్చిన మాట ప్రకారం అన్ని సంక్షేమ పథకాలు
అమలు చేస్తున్న వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. ప్రజల కష్టాలు
నెరవేర్చిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అని అన్నారు. చిన్న పిల్లల నుండి
పెద్దవాళ్ల వరకు అండగా వుండే వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి అన్నారు. సంక్షేమ
ప్రదాత జగన్ మోహన్ రెడ్డి అన్నారు. పేద ప్రజలు మంచి చేస్తున్న జగన్ మోహన్
రెడ్డికి సైనికుడిలా పని చేస్తుంటే ఆనందంగా వుందన్నారు.ఈ కార్యక్రమంలో నగర
మేయర్ రాయన భాగ్యలక్ష్మి, 34వ కార్పొరేటర్ బండి పుణ్యశీల, ఎస్ కె మాబు,
డివిజన్ నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.