విశాఖపట్నం : టీడీపీ నాయకులు అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానాలు
చెప్పడం లేదని, పైగా పార్టీలోని మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని
టీడీపీ మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత ఆరోపించారు. ఏపీలో గత నాలుగేళ్లలో 4
వేల అత్యాచారాలు జరిగాయని టీడీపీ మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత
ఆరోపించారు. ఫిర్యాదు చేద్దామంటే డీజీపీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని ఆమె
తెలిపారు. విశాఖలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో
మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచార ఘటల్ని కోర్టులు సుమోటోగా తీసుకొని
విచారణ చేయాలని కోరారు. తాము అడిగే ప్రశ్నలకు వైసీపీ నేతలు సమాధానం చెప్పడం
లేదని, టీడీపీ ఇతర పార్టీల మహిళలను కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని
మండిపడ్డారు. మద్యపాన నిషేధం ఎప్పట్నుంచి చేస్తారో చెప్పడం లేదు. సజ్జల
రామకృష్ణారెడ్డి కుమారుడు నాపై దుష్ప్రచారం చేయిస్తున్నారు. సీఎం జగన్ను
ప్రశ్నించడమే నేను చేసిన తప్పా? విమర్శించారని బాధపడి ఇంట్లో కూర్చునే మనిషిని
కాదు నేను’’ అని వంగలపూడి అనిత స్పష్టం చేశారు.