పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. రాష్ట్రానికి రూ.13 లక్షల కోట్ల
పెట్టుబడులు రానున్నాయని, 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి చూపించాయని సీఎం
జగన్ వెల్లడించారు. 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు
లభించనున్నాయని తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు
చెప్పారు. రాష్ట్రంలో అపార అవకాశాలు, అంతకు మించిన మానవ వనరులు ఉన్నట్లు
మంత్రులు తెలిపారు.విశాఖలోని ఆంధ్రా వర్సిటీ ఇంజినీరింగ్ కళాశాల ప్రాంగణంలో ప్రపంచ
పెట్టుబడిదారుల సదస్సు ప్రారంభమైంది. అడ్వాంటేజ్ ఏపీ నినాదంతో 14 రంగాల్లో
సదస్సు నిర్వహిస్తుండగా.. పలువురు కేంద్రమంత్రులు, పారిశ్రామికవేత్తలు సహా
వివిధ దేశాల రాయబారులు, వాణిజ్య ప్రతినిధులు హాజరయ్యారు. వీరిలో రిలయన్స్
గ్రూపు అధినేత ముఖేష్ అంబానీ, భారత్ బయోటెక్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ కృష్ణ
ఎల్ల, జీఎంఆర్ గ్రూపు అధినేత జి.మల్లికార్జునరావు, సైయంట్ అధినేత
మోహన్‌రెడ్డి, అదానీ పోర్ట్స్ సీఈవో కరణ్ అదానీ తదితర ప్రముఖులు
ఉన్నారు.పెట్టుబడి దారుల సదస్సు సందర్భంగా ఏపీలో పారిశ్రామిక వనరులపై రాష్ట్ర
ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. ఆయా రంగాల్లో అందుబాటులో ఉన్న
వనరులు, రవాణా సౌకర్యాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై డాక్యుమెంటరీ
ప్రదర్శించింది.పరిశ్రమల స్థాపనకు ఏపీ అనుకూలం..రాష్ట్రానికి రూ.13 లక్షల
కోట్ల పెట్టుబడులు రానున్నాయని, అందుకు విశాఖలో జరుగుతున్న పారిశ్రామిక వేత్తల
సదస్సు వేదిక కానుందని సీఎం జగన్ అన్నారు. 340 సంస్థలు పెట్టుబడులకు ఆసక్తి
చూపించాయని, 20 కీలక రంగాల్లో 6 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని
తెలిపారు. సదస్సు మొదటి రోజు 92 ఏంవోయూలు కుదుర్చుకున్నట్లు సీఎం
వెల్లడించారు.
సీఎస్ జవహర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామిక అవకాశాలు అపారం అని
చెప్పారు. పెట్టుబడులకు అనువైన ప్రాంతమని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఏపీ
ముందుందని తెలిపారు.సత్వర అనుమతులు..పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్
మాట్లాడుతూ పరిశ్రమల ఏర్పాటుకు సత్వరమే అనుమతులు అందజేయనున్నామని
వెల్లడించారు. రాష్ట్రంలో అపార ఖనిజ సంపద, పెట్టుబడులకు అపరిమిత అవకాశాలు
ఉన్నాయని తెలిపారు. సీఎం జగన్ నాయకత్వంలో అంధ్రప్రదేశ్ పారిశ్రామికంగా ఎంతో
అభివృద్ధి చెందుతోందని చెప్పారు. మౌలిక సదుపాయాల కల్పన వేగంగా జరుగుతోందని,
సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ జగన్ పాలన సాగుతోందని
చెప్పుకొచ్చారు.సహజ వనరులు అనేకం..అర్థిక శాఖ మంత్రి బుగ్గన మాట్లాడుతూ ఏపీలో
సహజ వనరులు పుష్కలంగా ఉన్నాయని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో రాష్ట్రం
ముందుందని తెలిపారు. పలు రంగాల్లో లాజిస్టిక్స్ అద్భుతంగా ఉన్నాయని, ఐటీ, ఐటీ
ఆధారిత పరిశ్రమలకు అనువైన వాతావరణం ఉందని పేర్కొన్నారు. నైపుణ్యం కలిగిన మానవ
వనరులకు కొదవ లేదని చెప్పారు.ప్రభుత్వ సహకారం..అపోలో ఆస్పత్రి వైస్
ఛైర్పర్సన్ ప్రీతారెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో ఏపీ ప్రభుత్వ కృషి
అభినందనీయమని, ఆరోగ్యశ్రీ పథకం ఇతర దేశాలకు విస్తరించిందని పేర్కొన్నారు.