టీడీపీ, ఎల్లో మీడియా స్కెచ్ అదే
పరిశ్రమలు వస్తే ఒక ఏడుపు.. రాకపోతే మరో ఏడుపా?
గ్రీన్ కో యాజమాన్యం జగన్ కి ఏలెక్కన బంధువులవుతారు?
మెగా పరిశ్రమలకు టెండర్లు ఉండవన్న ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదా?
చంద్రబాబు, రామోజీ, రాధాకృష్ణలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
నూటికి 98 శాతం హామీలు నెరవేర్చిన జగన్ గారిని ఎత్తిపొడుస్తారా?
మైనస్ మార్కులు వచ్చిన చంద్రబాబు మీకు హీరోనా?
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి
*అమరావతి : ఏపీకి పెట్టుబడులు వస్తుంటే కొందరు ఓర్వ లేకపోతున్నారని ఏపీ
ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఆయన
తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో
మాట్లాడుతూ, ఇండస్ట్రీలకు వేగంగా అనుమతులు ఇస్తున్నామని, ప్రభుత్వం నిబంధనల
ప్రకారమే అనుమతులు ఇస్తోందని స్పష్టం చేశారు. ‘‘రాష్ట్రానికి పెట్టుబడులు
వస్తుంటే విషం కక్కుతున్నారు. ఏ పెట్టుబడి వచ్చినా సీఎం జగన్‌కు బంధువులని
ప్రచారం చేస్తున్నారు. ఏపీకి పెట్టుబడులు రాకూడదన్నదే ఎల్లో మీడియా తాపత్రయం.
బరితెగించి తప్పుడు రాతలు రాస్తున్నారు. గత ప్రభుత్వం పద్దతి లేకుండా అనుమతులు
ఇచ్చింది’’ అని సజ్జల దుయ్యబట్టారు. ‘‘అడ్డగోలుగా మాట్లాడటం చంద్రబాబుకు
అలవాటుగా మారింది. ఏపీకి ఆదాయం రాకూడదనేదే టీడీపీ, ఎల్లో మీడియా లక్ష్యం. గత
ప్రభుత్వం చేసిన అప్పులకు మమ్మల్ని బాధ్యుల్ని చేస్తున్నారు’’ అని సజ్జల
రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు.
2019-20 లో ఆ ఇళ్ళు అసలు మంజూరే కాలేదు : పీఎంఎవై గ్రామీణ ఇళ్ళ పథకం కింద
2016-17, 2017- 18లో 1.23 లక్షల ఇళ్లను ఇస్తే 68,912 ఇళ్లను మొదలుపెట్టి
46,719 ఇళ్లను పూర్తి చేశారు. 2019- 20, 2020-21 సంవత్సరాలకు మనకు ఈ స్కీం
కింద ఇళ్లు మంజూరు కాలేదు. వాళ్లు చెప్తున్న 5 ఇళ్లు కూడా టీడీపీ హయాంలో
మొదలుపెట్టి ఇప్పుడు పూర్తి చేసినవే. వారు రాసింది తప్పు. మేం ఈ స్కీం కింద
ఇళ్ల నిర్మాణం చేపట్టలేదు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత- 2021- 22 ఏడాదిలో
1.79 లక్షల ఇళ్లు ఈ స్కీం కింద మంజూరు అయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముఖ్యమంత్రి
వైఎస్ జగన్ గారు విశాఖలో దీన్ని లాంచ్ చేశారు. వీటిలో కేవలం 7 నెలల
కాలంలోనే 67 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టాం, అవి వివిధ దశల్లో నిర్మాణంలో
ఉన్నాయి. 2024 మార్చిలోపు అన్నీ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని
పనిచేస్తున్నాం. టిడ్కో ఇళ్లు ఎలా మొదలయ్యాయో అందరికీ తెలుసు. మౌలిక వసతుల
డబ్బు దాంట్లో లెక్కకు వేసుకోలేదు. కేవలం ఎక్కడ కమిషన్ వస్తుందో అక్కడ
మాత్రమే టీడీపీ హయాంలో పనులు చేశారు. జగన్మోహన్ రెడ్డి గారిలా రివర్స్
టెండరింగ్‌కి వెళ్లలేదు. కట్టేవాటిని వాళ్లు సగంలో వదిలేశారు.
జగన్మోహన్రెడ్డి గారి ప్రభుత్వం అన్ని విధాల పూర్తి చేసి లబ్ధిదారునిపై
బరువు తగ్గించి ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రూపాయికే 300చదరపు
అడుగుల టిడ్కో ఇంటిని లబ్ధిదారునికి ఇస్తున్నాం. చంద్రబాబు హయాంలో టిడ్కో
ఇళ్లను ఎంచుకున్న వాళ్లు కూడా భారం వదిలించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే
ఇళ్లవైపు వచ్చారు.
జీతాలకు సంబంధించినంత వరకూ మేము అధికారంలోకి వచ్చేసరికి జీతాలు, పింఛన్ల
చెల్లింపుల ఖర్చు 5వేల కోట్లుంటే ఇప్పుడు అది 7 వేల కోట్లకు పైగా పెరిగింది.
ఏదైనా మేం చెల్లించాల్సిందే. అప్పట్లో రెగ్యులర్ ఉద్యోగికి ఒక టైం
ఉండేది…మిగిలిన టెంపరరీ ఉద్యోగులకు జీతాలు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు.
అలాంటిది మేం దాన్ని స్టీమ్ లైన్ చేశాం. ఈ నెల మాత్రమే కొంత ఆలస్యం
అయ్యింది. ఆ విషయం ఉద్యోగులకు కూడా చెప్పాం. వాళ్లు కూడా అర్ధం చేసుకున్నారు.
తెలంగాణాలో రకరకాలుగా చేస్తున్నారు..ప్రతి రాష్ట్రంలో ఏదో ఒక విధంగా జీతాల
వ్యవహారం నడుస్తోంది. మన రాష్ట్రంలో జరిగే దాన్ని మాత్రం వీళ్లంతా భూతద్ధంలో
చూపిస్తున్నారు. ఏది ఏమైనా పనిచేశారు కాబట్టి ఉద్యోగులు మొదటి వారంలో జీతాలు
రావాలనుకోవడంలో తప్పులేదు. అలా ఇవ్వడానికి ప్రభుత్వం కూడా కృషి చేస్తోంది.
కోవిడ్ వంటి కష్టాలు వచ్చినా, ఏ ఒక్క సంక్షేమ పథకం ఆగకూడదనే ముఖ్యమంత్రి
ఆకాంక్ష.
పండుగలోపే ఉద్యోగుల సమస్యలు పరిష్కారం : ఎప్పటికప్పుడు ఉద్యోగులతో చర్చలు
జరుపుతూనే ఉన్నాం. మొన్నీ మధ్య కూడా చర్చించాం. పండుగలోపు కాకపోతే వాళ్లు
ఆందోళన అంటున్నారు. వాళ్లు కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యులే. ఇది ఇంట్లో
పంచాయతీలాంటిదే. వాళ్లు, ప్రభుత్వం కలిసి పనిచేసే వారే కాబట్టి చర్చలు
జరుపుతాం. పరిష్కారం అవుతుందని భావిస్తున్నాం. పోలవరం విషయంలో నిన్న మా
ఎంపీలు పార్లమెంటులో కూడా మాట్లాడారు. ఆర్ అండ్ ఆర్ సహా కేంద్రం
భరించాల్సిందే. పనుల విషయంలో జరుగుతున్న ఆలస్యం పాపం మాత్రం చంద్రబాబుదే.
కాఫర్ డ్యాం, డయాఫ్రం వాల్ దెబ్బతినడం వంటి సమస్యలు వల్ల ఆలస్యం అవుతోంది.
ఆయన ఉన్నప్పుడు గేటుకు ఒక రేకు పెట్టి ఏదో చేసినట్లు చూపించుకున్నాడు. స్పిల్
వే పూర్తి చేసి, నీటిని డైవర్ట్ చేసి కిందికి వదలడం మా ప్రభుత్వం వచ్చిన
తర్వాతే జగన్మోహన్ రెడ్డి చేశారని పేర్కొన్నారు.