తిరుపతి : రాష్ట్రంలో వనరులను రెండు పార్టీలు దోచేస్తున్నాయని, 60:40 అంటూ
అధికార ప్రతిపక్ష పార్టీలు పంచుకుంటున్నాయని ఆంధ్ర ప్రదేశ్ బిజెపి
అధ్యక్షుడు సోము వీర్రాజు ఆరోపించారు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన
విధంగానే నేడు వైసీపీ ప్రభుత్వం అవినీతి రాజకీయాలు చేస్తున్నాయని, వాళ్లకు
సహకరించకుంటే వేయి కోట్లు ప్యాకేజి అంటూ బ్లాక్ మెయిల్ రాజకీయాలు
చేస్తున్నారని ధ్వజమెత్తారు. చైనాను లొంగదీసుకున్న బీజేపీకి వేలంతా ఒక లెక్క.
వ్యతిరేకిస్తే బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేస్తున్నారు. తెలుగు దేశం వాళ్లు
వైసీపీ ఏజెంట్లు అంటే వైసీపీ వాళ్ళు టీడీపీ ఏజెంట్లు అంటూ బిజెపి పై వ్యాఖ్యలు
చేయడం సబబు కాదన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయానికి ఎట్టి పరిస్థితుల్లో లోంగే
పరిస్థితి లేదని, ఇలాంటి రాజకీయాలకు బిజెపి చరమగీతం పాడుతుందన్నారు.
నియోజకవర్గానికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటున్నారు. కుటుంబ రాజకీయాలను బిజెపి
ప్రోత్సహించదు. ఉప ఎన్నికల్లో బస్సులు తోలి దొంగ ఓట్లు వేయించారు. 10వ తరగతి
పాస్ అయిన వారికి సైతం ఓట్లను పట్టభద్రుల ఓట్లను రాష్ట్ర ప్రభుత్వం
ఇచ్చిందని, నివాస ప్రాంతాల్లో కాలువల కోసం తవ్వేసి మామూళ్ల కోసం ప్రజలను మధ్య
పెడుతున్నారని ఆరోపించారు.
ఎమ్మెల్సీ అభ్యర్థిగా దయాకర్ రెడ్డిని కేంద్ర బిజెపి పార్టీ బీఫార్మ్
ఇచ్చింది. బిజెపి ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు ఉంది. వైసీపీ
మాట్లాడేవి బంగారు రేకులపై అక్షరాలా. బడ్జెట్ లో నిధులు రాకుంటే ఎందుకు బుగ్గన
కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ వద్దనే ఉన్నారు. ఈ బడ్జెట్ లో అత్యధిక నిధులు
ఏపీకి కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది. మోడీతోనే అభివృద్ధి సాగుతుంది. 60 పధకాలు
కేంద్ర ప్రభుత్వంవే. నాపై తిరుగుబాటు ప్రారంభం అయిందని ఛానెల్స్ లో మీరే
రాసుకుని మీరే అడుగుతున్నారు. వాస్తవాలు ఒక్క ముక్క మాత్రం బయటకు ఛానెల్స్ లో
రావడం లేదు. అభివృద్ధిపై డిబేట్ పెట్టండి. మేము రెడీ. అప్పర్ భద్ర కట్టిన
రాయలసీమకు వచ్చే నీళ్లు ఎక్కడ రాకుండా ఆగదు. రాయలసీమకు వచ్చే నీళ్ల వాటాను
కచ్చితంగా వచ్చేలా చేస్తాం. లక్షల కోట్ల రూపాయలతో రోడ్లు వేసిన ఘనత బీజేపీదే.
నడికుడి కాళహస్తి రైల్వే లైన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోవడం
ఎంతవరకు సబబు..? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కేంద్ర
నిధులతో మాత్రమేనని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు అడిగే హక్కు మాకే ఉంది. వైసీపీ
ని ఓడించే సత్తా బిజెపి కి మాత్రమే ఉందని సోము వీర్రాజు స్పష్టం చేశారు.
వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్రం జోక్యం ఉండదని, కేంద్రం ఎవరినీ కాపాడే
ప్రయత్నం చేయదని స్పష్టం చేశారు.