వెలగపూడి : స్థానిక సంస్థలు, 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు
షెడ్యూల్ రాష్ట్రంలో 13 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.
ఇందులో మూడు పట్టభద్రులు, రెండు ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ
స్థానాలు ఉన్నాయి. ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు పట్టభద్రుల స్థానంతోపాటు…
కడప-అనంతపురం-కర్నూలు పట్టభద్రుల నియోజకవర్గం, శ్రీకాకుళం-విజయనగరం-విశాఖ
పట్టభద్రుల స్థానం ఉన్నాయి. అలాగే ప్రకాశం- నెల్లూరు-చిత్తూరు జిల్లాల
ఉపాధ్యాయ స్థానం, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ నియోజకవర్గం ఉన్నాయి. ఇక
అనంతపురం, కడప, నెల్లూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం,
చిత్తూరు, కర్నూలు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు
జరుగుతాయి. వీటికి సంబంధించి ఈ నెల 16న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనుండగా
మార్చి 13న పోలింగ్ నిర్వహించి, 16వ తేదీన ఓట్ల లెక్కింపు చేపడతారు.