అమరావతి : విద్యార్థులకు జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలు
అందిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి
అన్నారు. ప్రభుత్వం ఆర్థిక సహాయం చేస్తుండటంతో పిల్లల చదువు ఎందుకు ఆపాలని
తల్లిదండ్రులు భావిస్తారు కదా?. ఇక ఏటా స్కూళ్లు తెరవటానికి ముందే జగనన్న
విద్యా కానుక పేరిట సమగ్ర కిట్‌ను ఇస్తున్నాం.
ఆరో తరగతి నుంచి డిజిటల్ తరగతులు ఏర్పాటు చేస్తున్నాం. నాడు–నేడు మొదటి దశ
కింద 15,275 పాఠశాలలను ఎంపిక చేసి వాటి రూపు రేఖలను సమూలంగా మార్చాం.
రాష్ట్రంలో 30,230 తరగతుల డిజిటలైజేషన్‌ను ఈ జూన్ నాటికి పూర్తి చేస్తున్నాం.
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తున్నాం. ఇప్పటివరకు 60వేల మంది
ఉపాధ్యాయులకు, 4.70 లక్షల మంది విద్యార్థులకు మొత్తం 5.30 లక్షల ట్యాబ్‌లు
పంపిణీ చేశాం. అంతేకాకుండా అంగన్వాడీ కేంద్రాలకు నిధులు పెంచాం. గతంలో
అంగన్వాడీ కేంద్రాలకు ఏడాదికి రూ.800కోట్లు కేటాయించేవారు. దీన్ని రూ.1,800
కోట్లకు పెంచాం.
ఆ సమయంలో వారికి సరైన పోషకాహారం అందించాలి. అదే చేస్తున్నాం. ఆడపిల్లల
పెళ్లికి సహకరిస్తూ వారు చదువు కొనసాగించేలా నిబంధనలు పెట్టాం. 10వ తరగతి
పాస్ అవ్వాలని, 18 ఏళ్లు నిండాలని నిబంధన పెట్టడం వల్ల వారు పది తరవాత ఇంటర్
చదువుతారు. డిగ్రీలోనూ చేరతారు. చేరారు కనక పూర్తి చేస్తారు. ఈ ఉద్దేశంతోనే
వివాహానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తున్నాం. చదువుల్లో రాణిస్తూ
విదేశాల్లో చదువుకోవాలనుకునే వారికి ‘విదేశీ దీవెన’ పథకాన్ని అందిస్తున్నాం.
ప్రభుత్వాసుపత్రులకు కాయకల్ప చికిత్స చేస్తున్నాం. ఎవ్వరూ ఊహించని విధంగా
వైద్య రంగంలో ఖాళీగా ఉన్న 48,000 పోస్టులను భర్తీ చేశాం. ప్రతి హాస్పిటల్లో
డాక్టర్, నర్సులు ఉండేలా విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చాం. జాతీయస్థాయి
ప్రమాణాలు ఉండేలా హాస్పిటల్స్‌ను ఆధునీకరించాం. 17 మెడికల్ కాలేజీలను ఏర్పాటు
చేస్తున్నాం. ఆరోగ్య శ్రీ పరిధిలోకి వచ్చే చికిత్సల సంఖ్యను 1,059 నుంచి ఏకంగా
3,255కు పెంచాం. ఫ్యామిలీ డాక్టర్, విలేజ్ హెల్త్ క్లినిక్, హెల్త్‌కార్డుల
డిజిటలైజేషన్ ఇలా అనేక సంస్కరణలు తెచ్చాం. రైతులకు విత్తనం దగ్గర నుంచి పంట
అమ్ముకోవడం వరకూ ఆర్బీకే ద్వారా చేయూత అందిస్తున్నాం.
ఎస్డీజీ లక్ష్యాలకు అనుగుణంగా సంక్షేమ పథకాలు : ఉచిత పథకాలు అంటూ కొంతమంది
తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి చేయకుండా కేవలం సంక్షేమ పథకాలే
ఇస్తున్నామనుకుంటే దేశంలోనే అత్యధికంగా 11.43 శాతం వృద్ధిని ఎలా సాధిస్తాం?
అన్ని రంగాల్లో సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకుంటూ అభివృద్ధి దిశగా
అడుగులేస్తున్నాం.