రాజ్‌భవన్‌లో ద్రౌపదీ ముర్ము బస
నేడు ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పరేడ్‌కు ముఖ్య అతిథిగా
హైదరాబాద్: రెండురోజుల పర్యటన నిమిత్తం హైదరాబాద్‌కు వచ్చిన రాష్ట్రపతి
ద్రౌపదీ ముర్ముకు ఘన స్వాగతం లభించింది. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి
కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆమెకు బేగంపేట విమానాశ్రయంలో స్వాగతం
పలికారు. మంత్రులు సత్యవతి రాథోడ్, మహమూద్ అలీ, సబితారెడ్డి, మల్లారెడ్డి,
తలసాని శ్రీనివాస్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎంపీలు
సంతోష్‌కుమార్, వెంకటేశ్ నేత, ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పల్లా
రాజేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, డీజీపీ అంజనీ
కుమార్ తదితరులు రాష్ట్రపతికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు.
దాదాపు 6 నెలల తర్వాత : సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై దాదాపు 6 నెలల తర్వాత
కలిశారు. చివరిసారిగా వారు గత ఏడాది డిసెంబరు 28న రాష్ట్రపతి శీతాకాల విడిదికి
హైదరాబాద్‌కు వచ్చినప్పుడు ఇద్దరూ కలిశారు. ఆ తర్వాత వారిద్దరూ పలకరించుకోవడం
ఇదే ప్రథమం. బేగంపేట విమానాశ్రయానికి ముందుగా సీఎం చేరుకున్నారు. ఆ వెనకే
గవర్నర్ వస్తుండగా సీఎం ఆమె చేరుకునే వరకు అక్కడే ఆగారు. ఇద్దరూ
మాట్లాడుకుంటూ విమానం వద్దకు చేరుకున్నారు. తాను స్వాగతం పలికిన అనంతరం సీఎం
మంత్రులను, నేతలను రాష్ట్రపతికి పరిచయం చేశారు. ద్రౌపదీ ముర్ము విమానాశ్రయం
నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకొని, రాత్రికి అక్కడే బస చేశారు. గవర్నర్
తమిళిసై, రాజ్‌భవన్ అధికారులు ఆమెకు స్వాగతం పలికారు. శనివారం ఉదయం
దుండిగల్‌లోని ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేషన్
పరేడ్‌కు రివ్యూయింగ్ ఆఫీసర్‌గా రాష్ట్రపతి హాజరవుతారు. పరేడ్ అనంతరం తిరిగి
ఢిల్లీకి వెళ్లిపోతారు.