హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా
జరుగుతున్నాయి. పార్టీ నేతలు, కార్యకర్తలు తమ ప్రియతమన నేతకు జన్మదిన
శుభాకాంక్షలు తెలుపుతున్నారు. పలు చోట్ల క్రీడాపోటీలు నిర్వహించి విజేతలకు
బహుమతులు ప్రధానం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా
రాష్ట్రవ్యాప్తంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ ఎల్బీ
స్టేడియంలో జరిగిన రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్లో విజేతలకు ఎమ్మెల్సీ
కవిత బహుమతులు అందించారు. గెలుపునకు చరిత్ర మలుపునకు మరో పేరు కేసీఆర్ అని
కవిత పేర్కొన్నారు. అనేక కష్టాలు ఎదురైనా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్
ప్రాణాలు పణంగా పెట్టి పోరాడి సాధించారన్నారు. అటువంటి వ్యక్తి పుట్టినరోజును
మరపురాని విధంగా ఉండాలని గత మూడేళ్లుగా రాష్ట్రస్థాయి వాలీబాల్ టోర్నమెంట్‌ను
నిర్వహిస్తున్నామని కవిత తెలిపారు.సిద్దిపేటలో సీఎం కేసీఆర్ క్రికెట్ ట్రోఫీ సీజన్- 3ని ఆర్థిక మంత్రి
హరీశ్‌రావు ప్రాంభించారు. ఈ కార్యక్రమానికి క్రికెటర్ అంబటి రాయుడు, నటుడు
నాని పాల్గొన్నారు. అంధుల సౌకర్యార్థం ప్రత్యేకంగా బ్రెయిలీ లిపిలో కేసీఆర్
సంక్షిప్త జీవిత చరిత్ర పుస్తకాన్ని మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. అంధులతో ఆ
పుస్తకాన్ని చదివించి ఆ విశేషాలు తెలుసుకున్నారు. కేసీఆర్ బాల్యం,
విద్యాభ్యాసం, రాజకీయ జీవితం, వివిధ హోదాల్లో పదవులు, కేసీఆర్ ఆధ్వర్యంలో
జరిగిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం, తెలంగాణలో అమలవుతున్న ప్రభుత్వ సంక్షేమ
పథకాలు పుస్తకంలో పొందుపరిచారు.ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టినరోజును
పురస్కరించుకొని ఓ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయుడు తన అభిమానాన్ని చాటుకున్నారు.
రాష్ట్రంలో అమలవుతున్న 100 సంక్షేమ పథకాలు, 2500 ముఖ చిత్రాలతో కూడిన భారీ
చిత్తరవును రూపొందించారు. వారం రోజులపాటు శ్రమించిన రూపొందించిన ఈ చిత్రం
చూపరులను ఆకట్టుకుంటోంది. స్పోర్ట్స్ అధారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో
రాష్ర్ట వ్యాప్తంగా చెస్ ఛాపింయన్‌షిప్ పోటీలు నిర్వహించారు. ఎల్బీ
స్టేడియంలో ఎనిమిది రోజులుగా ఆల్ ఇండియా కేసీఆర్ సేవాదళం ఆధ్వర్యంలో క్రికెట్
ట్రోఫీ నిర్వహించారు.