విజయవాడ: ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో గణతంత్ర వేడుకలను ఘనంగా
నిర్వహించారు. జాతీయ జెండాను ఏపీ గవర్నర్ హరిచందన్ ఆవిష్కరించారు. అనంతరం
పోలీసు బలగాల గౌరవవందనం గవర్నర్ హరిచందన్ స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ
వేడుకల్లో సీఎం జగన్ మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గణతంత్ర వేడుకల్లో గవర్నర్
ప్రసంగిస్తూ ‘‘నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి జరిగింది.
నవరత్నాల పథకాలు అర్హులందరికీ అందుతున్నాయన్నారు. జగనన్న గోరుముద్ద ద్వారా
విద్యార్థులకు పౌష్టికాహారం, విద్యా కానుక ద్వారా ఇంటర్, డిగ్రీ, బీటెక్
విద్యార్థులకు సాయం అందిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక రంగానికి వెన్నెముక..
వ్యవసాయం. రైతుల సంక్షేమం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నామని తెలిపారు. రైతు
కుటుంబాలకు ఏటా రూ.13,500 సాయం చేస్తున్నామని తెలిపారు. 37 లక్షల మంది రైతులకు
వైఎస్సార్ పంటల బీమా’’ అందిస్తున్నామని గవర్నర్ హరిచందన్ తెలిపారు.