విజయవాడ : గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ఆంధ్రరత్న
భవన్, విజయవాడ నందు గురువారం ఉదయం గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా
నిర్వహించారు. ఏఐసిసి సభ్యులు, నగర కాంగ్రెస్ అధ్యక్షులు నరహరశెట్టి నరసింహ
రావు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మొదటగా జాతిపిత మహాత్మా గాంధీ,
డా.బి.ఆర్. అంబేద్కర్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఫోటోలకు పూలమాలలు వేసి
నివాళులు అర్పించి అనంతరం జెండా వందనం చేశారు. ఈ కార్యక్రమంలో నరసింహారావు
మాట్లాడుతూ బ్రిటిష్ వారి సామ్రాజ్యం నుండి విముక్తి పొందిన భారత దేశం
స్వతంత్ర రాజ్యాంగాన్ని రూపొందించిన నేపథ్యంలో జనవరి 26, 1950 వ సంవత్సరంలో
రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, బ్రిటిష్ చట్టాలను కాలరాసి ప్రజా జీవనాన్ని
గాడిలో పెట్టిందని ఆయన అన్నారు. రాజ్యాంగ నిర్మాణానికి ఎంతో కృషిచేసిన
త్యాగధనుల జీవితాలను నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన సూచించారు. ఈ
కార్యక్రమంలో పెద్దఎత్తున కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు.