విశాఖపట్నం : జిల్లా పర్యటనలో భాగంగా విశాఖపట్నం విచ్చేసిన రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ కు విమానాశ్రయంలో జిల్లా అధికారులు సాదర స్వాగతం పలికారు. గురువారం భారత ఉప రాష్ట్రపతి జగ్ దీప్ ధన్కర్ తో కలిసి మిలాన్ – 2024 వేడుకలకు హాజరు కానున్న నేపథ్యంలో బుధవారం సాయంత్రం 05.15 గం.లకు విశాఖ విమానాశ్రయానికి రాష్ట్ర గవర్నర్ చేరుకున్నారు. ఆయనకు జిల్లా కలెక్టర్ డా.ఎ. మల్లిఖార్జున, జాయింట్ పోలీస్ కమిషనర్ డా. కె.ఫక్కీరప్ప, జడ్పీ సీఈఓ ఎం. పోలినాయుడు, రెవెన్యూ డివిజనల్ అధికారి హుస్సేన్ సాహెబ్ తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.